Wednesday, April 24, 2024

గోదావరిలో ఇసుక బావులు

- Advertisement -
- Advertisement -

పరిధిని మించి తవ్వకాలు
రాయిగూడెం ర్యాంపులో అంతా అక్రమమే
నడి గోదావరిలో పట్టాలు ఎలా వచ్చాయి?

Sand mafia in manuguru

మన తెలంగాణ/మణుగూరు : ఇసుక ర్యాంపుల పేరిట గోదావరి తీరంలో నిండు గోదావరిలో బావులు తవ్వుతూ ఇసుక అమ్మకాలకు తెరలేపుతున్న అక్రమార్కులకు టీఎస్‌ఎండిసి అండగా మారింది. వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ నదీ గర్బంలో మీటర్ల కొద్ది ఇసుక తోడుతూ బావులను తలపిస్తు అక్రమ ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్న పలువురికి మైనింగ్, జియాలజి, రెవిన్యూ శాఖలు మద్దతు ఇస్తున్న తీరు గోదావరిని భయానికి గురిచేస్తుంది. నడి గోదావరిలో పట్టాలు ఉన్నాయంటు మిషన్ మైనింగ్ కోసం కక్కుర్తి పడుతున్న అక్రమ ఇసుక వ్యాపారులు అధికారులను బురిడి కొట్టిస్తున్నారనే కంటే అధికారులే కాసుల కోసం వ్యాపారులకు కొత్త దారులను చూపుతున్నారని ఆరోపనలు వినపడుతున్నాయి.

ధరణీలో లేని పట్టాలు చేతిరాత పహాణీల ద్వార రికార్డులు సృష్టిస్తు పట్టా భూముల పేరిట గిరిజనేతర ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇస్తున్న అధికారులు అక్రమార్కులను ఇష్టారీతిన ఇసుక తొలుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. గిరిజన సోసైటి ర్యాంపుల్లో మిషన్‌ల ద్వార తవ్వకాలు చేపట్టడం అక్రమం అంటు మాన్యువల్ మైనింగ్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ఆంక్షలు విదిస్తున్న టీఎస్‌ఎండిసి పట్టా భూములకు మాత్రం బారి మినహాయింపులు ఇస్తు గోదావరిలో ఇసుక బావులు తోడేస్తున్నారు. రెండు విదానాల్లో ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇస్తున్న మైనింగ్ శాఖ పట్టా భూముల పేరుతో ఎర్పాటు చేస్తున్న ఇసుక ర్యాంపుల్లో ఏజన్సీ చట్టాలతో పాటు పలు జాతీయ జలవనరుల చట్టాలను అపహస్యం చేస్తున్నారు. గతంలో నధి గర్బంలో పట్టాలు ఎలా వచ్చాయంటు ఒ కలేక్టర్ పట్టా భూముల ఇసుక ర్యాంపులను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లుగా ఆదేశాలు జారి చేశారు. ఇసుక మేటలు తొలగిస్తే సాగుకు అనుకూలం అంటు వ్యవసాయ శాఖ కూడ ఈ అక్రమ అనుమతుల్లో తమవంతు కీలక పాత్ర పోషిస్తు అక్రమ ఇసుక వ్యాపారానికి అండదండలు అందిస్తుంది.

గోదావరిలో ఇసుక బావుల మూలంగా భవిష్యత్తులో నది జలాల గమనం పూర్తిగా మారిపోయో అవకాశం ఉందని ర్యాంపులు ఎర్పాటు చేసిన ఒడ్డున సమీప గ్రామాల్లో భూగర్బ జలాలు అడుగంటి త్రాగునీటి ఇబ్బందులు కూడ ఎర్పడే అవకాశం లేకపోలేదని పర్యావరణ పరిరక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మణుగూరు మండలాలతో పాటు బూర్గంపాడు, కరకగూడెం మండలాల్లో గోదావరి, కిన్నెరసాని నధులతో పాటు పెదవాగులో పట్టా భూముల పేరిట జరుగుతున్న ఇసుక ర్యాంపుల నిర్వాహన బారి అక్రమాలకు పాల్పడుతోంది. ర్యాంపుల అనుమతుల కోసం అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. పినపాక మండలంలోని ఎడూళ్ళ బయ్యారం రెవిన్యూ గ్రామ పరిదిలో రాయిగూడెంలో నిర్వహిస్తున్న సర్వె నెంబర్ 332, 330లలో 70వేల క్యూబిక్ మీటర్లు ఇసుక మేటల వేలికితీటకు అనుమతులు పోందిన అక్రమార్కులు వాల్టా చట్టాన్ని పూర్తిగా విస్మరించి 7 నుండి 8 మీటర్ల మీర ఇసుక తోడేస్తు గోదావరి నదిని చిద్రం చేస్తున్నారు.

ఇంత జరుగుతున్న అధికారులు ఎమి పట్టనట్లు వ్యవహరించడంపై స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధశాబ్దాల క్రితం రెవిన్యూ రికార్డుల నుండి గోదావరి కోతతో కనుమరుగైన పట్టాలను కొత్తగా వేదిక మీదకు తీసుకవస్తు అక్రమ అనుమతులను పోందుతున్న ర్యాంపు నిర్వాహకులు బారి బావులు తవ్వుతున్న విధానంపై విచారణ జరపాలని మిషన్ మైనింగ్ విదానాన్ని రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సోసైటి ర్యాంపుల్లో మిషన్‌లు పెట్టవద్దు అంటు ఆంక్షలు విదిస్తున్న అధికారులు వాటి సరిహద్దుల్లోనే పట్టా భూముల పేరిట జరుగుతున్న మైనింగ్‌లో మిషన్‌లను అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నీస్తున్నారు. నదులు, వాగుల ప్రవాహన్ని నియంత్రించే విదంగా జరుగుతున్న తవ్వకాలపై అధికారులు దృష్టి సారించాలని స్దానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News