Home నాగర్ కర్నూల్ ఇసుక తుఫాన్

ఇసుక తుఫాన్

Mafiya

శాపదాయినిగా పాపహరిణి కృష్ణమ్మ
 ప్లేస్ మాది టైం మీది
 రాజకీయ కోణంలోనే పరస్పర ఆరోపణలు?
 నిగ్గు తేల్చేదిశగా పడని అడుగులు

తమ తప్పులు, పాపాలు పోగొట్టుకోవడానికి పవిత్ర కృష్ణా జలాల్లో మునక వేస్తుంటారు. అయితే ఆ జలాలే ఇప్పుడు ప్రభుత్వం, ప్రభుత్వ నేతలపై ఆరోపణల శాపంగా మారుతున్నాయి. అంతరాష్ట్ర సరిహద్దుగా  నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని కృష్ణానది జలమార్గం ద్వారా  కొంతకాలంగా సాగుతున్న కోట్ల రూపాయల విలువైన అక్రమ రవాణా అంశం  జిల్లాలోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ తుఫాను రేపుతుంది. భారీ ఎత్తున జరుగుతున్న ఈ కుంభకోణంలో కొల్లాపూర్ నియోజక వర్గం శాసన సభ్యుడు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన  అనుచరుల హస్తం ఉందంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణలు, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కోర్టుకు వెళతామంటూ మంత్రి జూపల్లి అనుచరుల హెచ్చరికలు ఇరువర్గాల ఆరోపణలు ప్రత్యారోపణలు  కృష్ణా జలాలలో ఇసుక తుఫాను వేగం పెంచుతుంది.

మనతెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: సవాళ్లు ప్రతి సవాళ్లు తమ నేతపై కాంగ్రెస్ నా యకుల విమర్శల దాడిని ప్రతిఘటించే నేపధ్యంలో టిఆర్‌ఎస్ నేతలు ఓ అడుగు ముందుకు వేసి మంగళవారం కొల్లాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు సవాలు చేశా రు. చెప్పినట్లుగానే చెప్పిన సమయానికి వెళ్లి అక్కడ వేచి చూసినా కాంగ్రెస్‌నేతలు రాకపోవ డంతో పసలేని ఆరోపణలు చేసినందునే ముఖం చాటేశారంటూ కాలరెగిరేసుకుంటూ వెల్లి పోయారు. ఈ క్రమంలోనే తిరిగి కాంగ్రెస్ నేతలు ప్రతిగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు కేంధ్రంగా ఉన్న అమరగిరిలో బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని అక్కడికి జూపల్లి వస్తే కాంగ్రెస్ ఇంచార్జి బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా వస్తారని ఆధారాలు అక్కడే బహిర్గతం చేస్తామంటూ మరో సవాలు విసిరారు. స్థలం మేం సూచించాం సమయం మాత్రం మీరే నిర్ణయించాలంటూ టిఆర్‌ఎస్ నేతలకే వదిలి పెట్టారు. మరి ఈ సవాలుపై కూడా టిఆర్‌ఎస్ వర్గాలు ,మంత్రి సానుకూలంగా స్పందిచి తమపై పడ్డ మచ్చను తుడిచేసు కుంటారా లేదా అన్నది ప్రజలు ఆసక్తితో గమనిస్తున్నారు.

రాజకీయ విమర్శలకే పరిమితమా? మత్స దోపిడికావచ్చు, ఇసుక కావచ్చు, కంకరలాంటి సహజ సంపదలు కృష్ణాతీరం అడ్డా గా జలమార్గం గుండా జరుగుతున్న వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ దందాలను కేవలం రాజకీయంగానే పరిగణిస్తూ విమర్శలు ప్రతివిమర్శలతో కాలంవెల్లబుచ్చేది మంచి పద్దతి కాదన్నది పలువురి అభిప్రాయం. అధికార ,విపక్ష నేతల మాటల తూటాలు ఎలా ఉ న్నా ఈ భారీ కుంభకోణం వెనక సాధారణ వ్యక్తులు గాక బడా బాబుల హస్తం లేనిదే ఇం త పెద్ద ఎత్తున వ్యవహారం కొనసాగించే వీలు లేదన్నది నగ్న సత్యం .మరి ఆ అదృశ్య శక్తులు ఎవరన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. సీమాంధ్ర దోపిడి అరికట్టడమే లక్షంగా ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన టిఆర్‌ఎస్ ఇప్పుడు అధికారంలో ఉంది.

ఉద్యమ పార్టీ పాలనలోకూడా పరాయి దోపిడి కొనసాగడం పాలక పక్షానికి మాయని మచ్చ కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా స్వయంగా తానూ ఓ ఉద్యమ కారుడిగా వ్యవహరించిన మంత్రి జూపల్లి కొల్లాపూర్ కు ప్రాతినిధ్యం వహి స్తున్నారు. జరుగుతున్న అభివృద్ది అంతా తన చలువే నని చెప్పుకుంటున్న జూపల్లి .జరిగిన అక్రమ రవాణాలో తన స్వచ్చతను కూడా రుజువు చేసుకోవల్సిన బాధ్యత ఎంతైనా వుందని పలువురు అంటున్నారు. తమ మంత్రి వర్గ సహచరుడిపై వస్తున్న ఆరోపణల విషయంలో కనీ సం ప్రభుత్వమైనా నోరు విప్పి విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గు తేల్చి ఆవినీతి మరకలు తుడుచుకోవల్సిన బాధ్యత లేదా అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ప్రభుత్వ పెద్దల హస్తం లేకపోతే అక్రమ రవాణాపై విచారణకు ఆదేశించి చిత్త శుద్ది చాటుకోవాలని కూడా పలువురు కోరుతున్నారు.