Home వనపర్తి గోపాల సముద్రం చెరువులో ఇసుక తోడేళ్లు

గోపాల సముద్రం చెరువులో ఇసుక తోడేళ్లు

tractor

*ఆరు నెలలుగా యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక దందా
*పోలీస్,రెవెన్యూ అధికారుల వెన్నుదన్ను..?
*వెలుగు చూసిన ఒకటి రెండు రోజులు హడావిడి..
మళ్లీ యథావిధి
*రింగు తిరుగుతున్న బిటి బ్యాచ్ నేత
*మీడియాను చూసి పరుగులు పెట్టిన ట్రాక్టర్లు, వ్యాపారులు

మన తెలంగాణ/పెద్దమందడి ః మండలంలోని వెల్టూర్ గ్రామ శివారులోని గోపాల సముద్రం చెరువు ఇసుక తోడేళ్లకు అడ్డాగా మారింది. పరిసర గ్రామాల ట్రాక్టర్ల యజమానులు రాత్రింబవళ్లుఅనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తు కొందరు పొలాల్లో ఇసుకను నిల్వ చేస్తే మరి కొందరు నేరుగాగృహ ,వాణిజ్య భవనాల నిర్మాణాలకు విక్రయిస్తు లక్షల రూపాయలను అక్ర మంగా వెనక్కేస్తున్నారు. వారికి సహకరించే అధికారులకు అప్పుడప్పు డు చేతులు తడుపుతూ ఇసుక దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత మూడు నెలల క్రితం భారీ వర్షాల కారణంగా వెల్టూర్ గోపాల సముద్రం లోకి నీరు వచ్చి చేరింది. పాత ఇసుక క్వారీలు మునిగి పోవడంతో ఇసుక వ్యాపారులు మద్దిగట్లకు సమీపంలోని గోపాలసముద్రం చెర్వు శిఖం భూమిలో జెసిబిలతో భూమి పై నుండి రెండు ఫీట్ల లోతున మట్టిని తొలగించి క్రింది భాగంలో నాణ్యమైన ఇసుక ఉండడంతో వెల్టూర్,గట్లఖానాపూర్,మోజర్ల ,అమ్మపల్లి,మద్దిగట్ల , గ్రామాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా వందల మంది కూలీల సహాయంతో 30 నుండి 40 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మద్దిగట్ల సమీపంలో వెల్టూర్ గోపాల సముద్రం చెర్వు శివారులో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని పోలీస్, రెవెన్యూ అధికారులకు ప్రజలు,రైతుల నుండి ఫిర్యాదులు వెళ్లిన చేసి నప్పటికి పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ల యజమా నులు దర్జాగా పోలీస్, రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతూ వ్యాపా రాన్ని చక్కబెట్టుకుంటున్నారు. జిల్లా మైనింగ్ అధికారులు కూడా అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావి స్తుంది. గతంలో చిలకటోని పల్లి, బలీద్‌పల్లి గ్రామాల పరిధిలోని ఊకశెట్టు వాగులో ఉన్న ఇసుకను అక్రమంగా తరలించే ట్రాక్టర్ల యజమానులు అక్కడ నుండి ఇసుక తరలింపుకు స్వస్తి చెప్పి కొత్త పంథాలో రూట్ మార్చి ఇసుక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. చెరువులో కంపచెట్ల పొదల మాటున ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలి స్తున్నారు. వెల్టూర్ సమీపంలోని ఓ చికెన్ పరిశ్రమకు భారీగా రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుక వ్యాపారాన్ని నడిపించడం వెనుక ఒక బిటి బ్యాచ్ (బంగారు తెలంగాణ) నాయకుని పాత్ర పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో వార్తలు వస్తే ఒకటి రెండు రోజులు హడావిడి చేసే అధికారులు తర్వాతమౌనంగా ఉండి పోవడం వల్ల ఇసుక వ్యాపారం మళ్లీ యథాస్థితికి చేరుకుంటుంది. గురువారం మీడియా సిబ్బంది ఇసుక క్వారీ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా పసిగట్టిన ఇసుక వ్యాపారులు,కూలీలు ట్రాక్టర్లతో పరారయ్యారు.
మీడియాను మేనేజ్ చేస్తామని డబ్బుల వసూళ్లు: గోపాల సముద్రంలోని చెరువులో ఇసుక క్వారీల దగ్గరకి కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను చూసి పరారైనవ్యాపారులు కొద్దిసేపటి తర్వాత మీడియా సిబ్బంది దగ్గరికి వచ్చి మేనేజ్ చేసేందుకు ప్రయత్నించారు.ఒక్కోట్రాక్టర్ రూ.500 చొప్పున ఇస్తా మని 10 ట్రాక్టర్ల యజమానులు జత కట్టి మీడియాతో బేరానికి దిగారు . అనంతరం మీడియా అక్కడ నుండి వచ్చిన వెంటనే మళ్లీ యథావిధిగా ఇసుక వ్యాపారం కొనసాగింది.