Home తాజా వార్తలు కరోనాతో శాండల్ వుడ్ దర్శకుడు నవీన్ కన్నుమూత

కరోనాతో శాండల్ వుడ్ దర్శకుడు నవీన్ కన్నుమూత

Sandalwood Director Naveen Dies With Coronaబెంగళూరు : శాండల్ వుడ్ లో విషాదం నెలకొంది. శాండల్ వుడ్ దర్శకుడు నవీన్(36) కరోనాతో బాధపడుతూ సోమవారం  కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.  ’వన్ డే ఇన్ 2011‘ సినిమాతో నవీన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తన తొలి సినిమాతోనే శాండల్ వుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో అప్పు వెంకటేష్, రేవన్న ప్రధాన పాత్రల్లో నటించారు. రెండో సినిమాను రూపొందించే పనిలో ఉండగా ఆయన కరోనా బారినపడ్డారు. పిన్నవయస్సులోనే నవీన్ చనిపోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నవీన్ మృతిపై పలువురు శాండల్ వుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.