Sunday, March 26, 2023

పాలమూరులో ఇసుక ఇక్కట్లు

- Advertisement -

sand

*ఇసుక కొరతతో ఆగిపోతున్న నిర్మాణాలు
*ఆర్థిక ఇబ్బందుల్లో భవన నిర్మాణ కార్మికులు
*రోడ్డున పడ్డ అడ్డా కూలీలు

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ ఇసుకను రూపుమాఫీ ఇసుక మాఫియా చెక్ పెట్టేందుకుగాను పాలమూరు జిల్లా అధికారులు, పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కుల పట్ల ఉక్కుపాదం మోపుతున్నారు. ఇసుక రవాణాను పారదర్శకంగా చేపట్టేందు కుగాను రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ కృషితో పాలమూరు శాండ్‌పేరుతో ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలను ప్రారంభించారు. దీనికిగాను 2017 ఆగస్టు 15న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి www.palmoorsand.com వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారం భించారు. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే నిర్ణీత కాలవ్యవధిలో ఇసుక రవాణాను అధికారులు చేపట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇసుక రవాణా ఎలాంటి సమస్యలు లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో చేపట్టిన అధికారులు ఇప్పుడు సాంకేతిక కారణాల కారణంగా ఇసుకను సమయానికి అందించలేకపోతున్నారు. దీంతో పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా కనిపిస్తుంది. ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు అసంపూర్తిగానే ఆగిపోతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు, నిర్మాణ రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న ఫ్లంబర్స్, ఎలక్ట్రీషియన్లు, కార్ పెంయింటర్సే, పెయింటర్స్, తదితర కార్మికులు చేతినిండా పని దొరక క ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  పాల మూర్ శాండ్‌కుబ్రేక్ పడడంతో భవన నిర్మా ణాలు చేపడుతున్నవారు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇసుక కొరత కారణంగా ఓ వైపు భవననిర్మాణ రంగ కార్మికులు, భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ ఇతర కార్మికులు ఇబ్బందులు గురికావడమే కాకుండా నిర్మాణా లు చేపడుతున్న వారు సైతం అనుకున్న సమయా నికి నిర్మాణాలు పూర్తి చేయడంతో జాప్యం జరుగు తుండడంతో పలుసమస్యలతో తిప్పలు పడుతున్నారు.  ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు అసంపూర్తిగానే ఆగిపోతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు, అడ్డ కూలీలు, నిర్మాణ రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న ఫ్లంబర్స్, ఎలక్ట్రీషియన్లు, కార్‌పెంయింటర్స్, పెయింటర్స్, తదితర కార్మికులు చేతినిండా పని దొరకక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు సాంకేతిక కారణాల కారణంగా పాలమూరు శాండ్ వెబ్‌సైట్ సైతం పనిచే యకపోవడం కారణంగా ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడంలో నిర్మాణాలు చేపట్టాలనుకున్న వారు సైతం వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. పాలమూర్ శాండ్‌కు బ్రేక్ పడడంతో భవన నిర్మా ణాలు చేపడుతున్న వారు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇసుక కొరత కారణంగా ఓ వైపు భవన నిర్మాణ రంగ కార్మికులు, భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ ఇతర కార్మికులు ఇబ్బం దులు గురికావడమే కాకుండా నిర్మాణాలు చేపడుతున్న వారు సైతం అనుకున్న సమయానికి నిర్మాణా లు పూర్తి చేయడంతో జాప్యం జరుగుతుండడంతో పలు సమస్యలతో తిప్పలు పడుతున్నారు.
పాలమూర్ శాండ్‌కు బ్రేక్
ఎలాంటి అక్రమాలు లేకుండా పారదర్శకంగా ఇసుకను రవాణా చేయుటకుగాను జిల్లా కలెక్టర్ రోనా ల్డ్‌రోస్ చొరవతో చేపట్టిన ఆన్‌లైన్ ఇసుక విధానం పలు జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో పాలమూర్ జిల్లాలో ఆన్‌లైన్ ఇసుక విక్రయాలకు బ్రేక్ పడింది. పలు సాంకేతిక కారణాలతో పాలమూర్ శాండ్ వెబ్‌సైట్‌ను ప్రస్తుతానికి ఆపివేయడంతో ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాలమూర్ శాండ్ హెల్ప్‌లైన్ సెంటర్ సైతం ఇటీవలే హైదరాబాద్‌కు తరలివెళ్లడంతో ఇసుక ఇక్కట్లు తీవ్రంగా మారాయి. ఇసుకను ఆన్‌లైన్ లో బుక్ చేసుకున్న వారు సైతం ఇప్పటివరకు ఇసుక అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫోన్ ద్వారా హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదిస్తే ఇసుక కొరత కారణంగా నిర్ణీత సమయానికి ఇసుక రవాణా జరగడం లేదని, ప్రస్తుతానికి వెబ్‌సైట్‌ను ఆపివేయడం జరిగిందని, బుక్‌చేసుకున్న వారికి ఇసుక రవా ణా చేసిన తర్వాతే తిరిగి వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని సమాధానం చెబుతున్నట్లు భవన నిర్మాణాలు చేపడుతున్న వారు చెబుతున్నారు. ఇసుక కొరత, సాంకేతిక సమస్యలతో పాలమూర్ శాండ్‌కు బ్రేక్ పడడంతో భవన నిర్మాణాలు చేపడుతున్న వారు, భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణరంగంపై ఆధారపడి బతుకుతున్న వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక కొరత..
పాలమూర్ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా కనిపిస్తుంది. దీంతో నిర్మాణాలు సగంలోనే ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని వాగుల నుంచి ఇసుకను సేకరించి ఆన్‌లైన్ విధానం ద్వారా అధికారులు ఇసుక రవాణాను చేపడుతున్నారు. వాగుల్లో నీరు అధికంగా ఉండడం, భవన, తదితర నిర్మాణాలు అధికంగా జరగడం, రాత్రి పూట ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలుతుండడం, తదితర సమస్యలతో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలో ఇసుక రవాణా చేయకపోవడంతో చాలా వరకు నిర్మాణాలు సగంలోనే ఆగిపోవడం జరిగింది. త్వరలోనే మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుని ఇసుక కొరతను అధిగమిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇసుక సమస్యలను పరిష్కరించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకున్న వారికి ఇసుకను రవాణా చేసిన అనంతరం త్వరలోనే తిరిగి పాలమూరు శాండ్ వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో అందుబా టులోకి తెస్తామని, నిర్ణీత సమయానికి ఇసుక అందించేందుకు కృషి చేస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో భవన నిర్మాణ కార్మికులు
ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు సగంలోనే ఆగిపోవడం, కొత్త నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు వెనకడుగు వేస్తుండడంతో చేతి నిండా పని దొరకక భవన నిర్మాణ కార్మికులు, అడ్డ కూలీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని రోజువారీ కూలీలు పని కోసం రోజు అడ్డ్డాకు చేరుకోవడం పని దొరకక తిరిగి ఇంటికి వెళ్లడం పరిపాటిగా మారింది. గత 15 రోజుల నుంచి ఇసుక కొరత కారణంగా చేతికి పని దొరకక అడ్డకూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టు న్నారు. భవన నిర్మాణ మేస్త్రీలు, సివిల్ కాంట్రాక్టర్లు సైతం ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవ డం, అసంపూర్తిగా నిర్మాణాలు ఆగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులను చవిచూస్తున్నారు. పనులు పూర్తికాక సమయానికి బిల్లులు రాక ఆందోళనకు గురవుతున్నారు. కేవలం భవన నిర్మాణ కార్మికులు, అడ్డ కూలీలు మాత్రమే కాకుండా భవన నిర్మాణ రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న ప్లంబర్లు, కా ర్పెంటర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, తదితర కార్మికులు సైతం రోడ్డున పడుతున్నారు. పనులు లేక నానా తంటాలు పడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఆందోళనకరంగా మారిన పరిస్థి తుల కారణం గా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ ఇసుకపై పోలీసులు ఉక్కుపాదం..
ఇసుక కొరతపై జిల్లా అధికారులు సైతం సీరియస్‌గానే ఉన్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇసుకను అందించేందుకు కంకణబద్ధుడై ఉండడంతో ఇసుక కొరతను అధిగమించేందుకు గాను జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇసుక కొరతను అధిగమించి ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తిరిగి పాలమూరు శాండ్ ద్వారా ఇసుకను ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక రవాణా చేయుటకు అధి కారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించడంతో రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతున్నారు. అక్రమ ఇసుక దందాను పూర్తిగా నిర్వీర్యం చేసి ఇసుక మాఫియాను తరిమికొట్టాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో జిల్లాలోని ఆయా మండలాల ఎస్‌ఐలు ఇసుక అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని కేసులను నమో దు చేస్తున్నారు. ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఇసుక కష్టాలపై అధికారులు దృష్టి సారించాలి: ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు సగంలో నే ఆగిపోతున్నాయి. దీంతో భవన నిర్మాణ కార్మి కులు, భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న తదితర కార్మికులు, అడ్డకూలీలు పని దొరకక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇసుక కొరతపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరలోనే ఇసుక కొరతను అధిగమించి భవన నిర్మాణ రంగం పరుగులు పెట్టేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టి ఆన్‌లైన్ విధానంలో ఇసుకను అనుకున్న సమయానికి అందించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకు ని ఇసుక కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News