Home సంగారెడ్డి సంగారెడ్డి శ్రీమంతుడు

సంగారెడ్డి శ్రీమంతుడు

cycle

*సమస్యలు తెలుసుకొనేందుకు సైకిలెక్కిన కలెక్టర్
*ఆకస్మిక తనిఖీలతో హల్‌చల్
*వైద్యం, తాగునీటిపై ప్రత్యేక నజర్
*జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి : కలెక్టర్

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : కలెక్టర్ అంటే ఎసి హాల్‌లో సమీక్షలు పెట్టడమేకా దు.. క్షేత్రస్థాయిలో ప్ర జా సమస్యలను తెలుసుకొనేందుకు మండుటెండలో సైకిల్ ఎక్కి వీధి వీధి తిరిగి సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రజలకు శ్రీమంతుడయ్యాడు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పా లనపై తనదైన ము ద్ర వేసేందుకు ప్ర యత్నిస్తున్నారు. సంగారెడ్డిలోనే అ దనపు జిల్లా సం యుక్త కలెక్టర్‌గా, సంయుక్త కలెక్టర్ గా, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ప నిచేసిన వాసం వెంకటేశ్వర్లు సంగారెడ్డి జిల్లాలో సమస్యలను సమర్థవంతంగా ఎలా పరిష్కరించాలో తెలిసి ఉన్న ఆయన ఆ దిశగా తన ప్రయత్నాలు ప్రారంభించారు. కలెక్టర్‌గా బా ధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలతో హల్‌చల్ చేస్తున్నారు. ముందుగా వైద్య రంగంపై దృష్టి సా రించి జిల్లా కేంద్ర ఆ సుపత్రిని తనిఖీ చేసి పేదలకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నా రు. ప్రతి నిరుపేదకు మెరుగైన వైద్యం అందాల్సిందేనని ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్ర భుత్వ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పి ల్లలకు అందుతున్న పౌష్టికాహారం గు రించి ఆరా తీశారు. పిల్లలకు పౌష్టికాహారం అందే విషయంలో  ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా రాకూడదని అధికారులకు సూచించారు. ఇక సంగారెడ్డి పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్యంపై దృష్టి సారించి తెల్లవారుజామునే సైకిల్‌పై వీధి వీధి తిరిగారు. తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి పట్టణంలోని నాల్సాబ్‌గడ్డ, రాజీవ్‌పార్కు తదితర వీధులన్నీ కలియతిరిగారు. పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను స్వయంగా తెలుసుకున్నారు. ఉదయాన్నే సరఫరా అవుతోన్న తాగునీటి వ్యవస్థ గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కన పడి ఉన్న చెత్తా చెదారాన్ని చూసి మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించి శుభ్రం చేయాలని ఆదేశించారు. పట్టణమంతా క్లీన్ సిటీగా మారాలని అన్నారు. అక్కడి నుంచి కొత్త బస్టాండ్‌ను సందర్శించారు. క్యాంటీన్‌లో అమ్ముతున్న తినుబండారాలను పరిశీలించారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు నీటి సదుపాయం కల్పించాలని ఆర్‌టిసి అధికారులకు సూచించారు. అంతేగాక జిల్లాలోని ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ, ఆర్‌డబ్లూఎస్ ఎఇలు, తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తు త వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతంగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఏ ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉందో పరిశీలించి చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేయించడం, బోర్లను మరమ్మతు చేయించడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశించారు. దీంతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి జిల్లాను స్వచ్ఛ జిల్లాగా ప్రకటించుకొనే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనప్పటికీ సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులు పెడుతూ అధికారులను కూడా ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారనే చెప్పాలి.