Home తాజా వార్తలు అభివృద్ధి కోసం కెసిఆర్ ముందు తలవంచుతా… జగ్గారెడ్డి

అభివృద్ధి కోసం కెసిఆర్ ముందు తలవంచుతా… జగ్గారెడ్డి

Sangareddy MLA Jaggareddyసంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ ముందు తాను తలవంచుతానని కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల సాధనే ధ్యేయంగా తాను ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా ఇకపై తాను ఎప్పుడు మాట్లాడనని, కెసిఆర్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు సూచించారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా కూడా మాట్లాడవద్దని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చే ప్రయోజనాలు ఏవీ ఉండవని, తాను ఏదీ చేసినా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమేనని ఆయన తేల్చి చెప్పారు.

Sangareddy MLA Jaggareddy Comments On CM KCR