Home ఆఫ్ బీట్ సంగీత మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్

సంగీత మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్

Vijay

మన తెలంగాణ /పంజాగుట్ట : సంగీత మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటు డు విజయ్ దేవరకొండను నియమించినట్లుగా సంస్థ ఎండీ సుభాష్ చంద్ర తె లిపారు. మంగళవారం యూసఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో నూత న బ్రాండ్ అంబాసీడర్ ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తా ను మొబైల్స్ దూరంగా ఉండాలని అనుకుంటానని కానీ ప్రస్తుతం ఉ న్న పరిస్థితుల్లో ఆది సాధ్యం కావ డం లేదని అన్నారు.

అగస్టు నేల లో తన నూతన చిత్రం “ జస్ట్ మ్యారిడ్‌” చిత్రం ద్వారా మరోసారి సందడి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంగీత సంస్థ ఎండీ సు భాష్ మాట్లాడుతూ తమ సంస్థ ఏర్పాటై నాలుగు దశాబ్ధాలు గడచి నా ఇప్పటి వరకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవ్వరి నీ నియమించలేదని, మొదటిసారిగా విజయ్ దేవరకొండను తమ సంస్థ ప్ర చారా ప్రతినిధిగా నియమించ డం ఎం తో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థ్ధులకు బహుమతులను విజయ్ అందజేశారు.