Home స్కోర్ సానియా జోడీదే విజయం

సానియా జోడీదే విజయం

Untitled-7కోల్‌కతా : దిగ్గజాల పోరులో సానియామీర్జా జోడీనే గెలిచింది. ఇంటర్నేషనల్ ప్రిమియర్ టెన్నిస్ లీగ్(ఐపిటిఎల్)కు భారత్‌లో ప్రాచూ ర్యం కల్పించడంలో భాగంగా దిగ్గజాల పోరు పేరుతో కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో సానియామీర్జా-మహేశ్‌భూపతి జోడీ 7-5, 7-5తో లియాండర్‌పేస్-మార్టినానత్రిలోవా జంటను ఓడించింది. తొలిసెట్ ఆరంభంలో పేస్-నత్రిలోవా జంట 3-0తో నిలిచినా ఐదు, 11వ గేమ్‌లలో పేస్ జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియాజోడీ 7-5తో నెగ్గింది. ఇక రెండోసెట్‌లోనూ ఇరుజంటలు పోటాపోటీగా తలపడ డంతో మొదట 2-2తో, తరువాత 4-4తో సమమైనా మరోసారి పేస్ జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా జోడీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇరుజంటల మధ్య హైదరాబాద్‌లోని సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో 27న(రేపు) రెండోమ్యాచ్ జరుగనుంది.