Friday, April 19, 2024

సానియా జోడీకి రన్నరప్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన సానియా మీర్జారోహన్ బోపన్న జోడీ ఓటమి పాలైంది. బ్రెజిల్‌కు చెందిన ల్యూసా స్టెఫాని, రాఫెల్ మాటొస్ జంటతో జరిగిన ఫైనల్ పోరులో సానియా జోడీ 67, 26 తేడాతో పరాజయం చవిచూసింది. తొలి సెట్‌లో ప్రత్యర్థి జోడీకి గట్టి పోటీ ఇచ్చిన భారత జంట తర్వాతి సెట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఇక ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రెజిల్ జోడీ వరుసగా రెండు సెట్‌లు గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఫైనల్లో జకోవిచ్, సిట్సిపాస్

పురుషుల సింగిల్స్ విభాగంలో అగ్రశ్రేణి ఆటగాళ్లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీస్) ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నాలుగో సీడ్ జకోవిచ్ 75, 61, 62 తేడాతో అమెరికాకు చెందిన టామీ పాల్‌ను చిత్తు చేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో అలరించిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరడం జకోవిచ్‌కు ఇది వరుసగా పదోసారి కావడం విశేషం. ఇక మరో సెమీఫైనల్లో మూడో సీడ్ సిట్సిపాస్ చెమటోడ్చి నెగ్గాడు. రష్యా ఆటగాడు కరెన్ కచనోవ్‌తో జరిగిన పోరులో సిట్సిపాస్ 76, 64, 67, 63తో విజయం సాధించాడు. వరుసగా రెండు సెట్లు గెలిచి జోరుమీద కనిపించిన సిట్సిపాస్‌కు మూడో సెట్‌లో కచనోవ్ షాక్ ఇచ్చాడు. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో సిట్సిపాస్ ఓటమి పాలయ్యాడు. కానీ నాలుగో సెట్‌లో మళ్లీ అలవోకగా గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జకోవిచ్‌తో సిట్సిపాస్ తలపడుతాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News