Wednesday, April 24, 2024

సానియా మిర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ అధికారి అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ అడవుల్లో కాల్పుల జరిపిన కేసులో పురోగతి లభించింది. సానియా మిర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ అధికారిని అరెస్టు చేశారు. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల వికారాబాద్ అడవుల్లో జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామగుండంలో సానియా మిర్జా, ఆమె బంధువులకు ఫాంహౌస్ లు ఉన్నాయని, ఫాంహౌస్ కు వస్తున్నవారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫాంహౌస్ చుట్టుప్రక్కలకు పశువులను తీసుకురావొద్దంటూ నిర్వహకులు తమను బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. దీంతో ఫాంహౌస్ నిర్వహకులు, సిబ్బందిని పోలీసులు విచారించారు. కాల్పుల ఘటనలో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల క్రితం ఎద్దును కాల్చి చంపిన ఫాంహౌస్ ఇన్ చార్జ్ ఉమర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Sania Mirza Farmhouse Security officer arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News