Home తాజా వార్తలు అరటి పీచుతో శానిటరీ నాప్‌కిన్లు

అరటి పీచుతో శానిటరీ నాప్‌కిన్లు

Banana-Fibre పర్యావరణ రక్షణకు ఎంతో మేలు
ఈ నాప్‌కిన్‌ను 120 సార్లు వాడవచ్చు
తయారు చేసిన ఢిల్లీ ఐఐటి స్టార్టప్

న్యూఢిల్లీ: అరటి పీచుతో తయారు చేసే శానిటరీ నాప్‌కిన్లను ఢిల్లీకి చెందిన ఒక ఐఐటి స్టార్ట్ అప్ తయారు చేసింది. ఈ విధంగా తయారైన నాప్‌కిన్లు రెండేళ్లు మన్నడమే కాక, వాటిని 120 సార్లు ఉపయోగించవచ్చు. ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ల తోడ్పాటుతో శాన్‌ఫే అనే సంస్థ ఈ నాప్‌కిన్లను తయారు చేసింది. రెండు నాప్‌కిన్లు రూ. 199 లకు లభిస్తాయి. ఈ ప్రోడక్ట్ తయారుచేసిన టీమ్ దీని పేటెంట్‌కోసం కూడా దరఖాస్తు చేసింది. ‘శానిటరీ నాప్‌కిన్లు చాలావరకు కృత్రిమ పదార్థాలతో (సింథెటిక్ మెటీరియల్స్) తయారవుతాయి.

అవి శిథిలం కావడానికి 50 నుంచి 60 ఏళ్లు పడుతుంది. మహిళలు రుతుక్రమ సమయంలో వాడే వీటిని ఆ తర్వాత బహిరంగ ప్రదేశాల్లోనో, టాయ్‌లెట్లలోనో, నీటిచెలమల్లోనో పారేస్తుంటారు. లేదా కాలుస్తుంటారు. ఈ వ్యర్థాలు చాలా పెద్ద పరిమాణంలోనే ఉంటాయి. వీటివల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది’ అని స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అర్చిత్ అగర్వాల్ చెప్పారు. ఈ వ్యర్థాలను కాల్చడం వల్ల డయోక్సిన్స్ రూపంలో రసాయని క పొగలు వెలువడుతాయి. అందువల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందని, దాన్ని అధిగమించేందుకే ఈ కొత్త ఉత్పత్తిని కనిపెట్టామని అన్నా రు. హ్యారీ సెహ్రవత్ తో కలిసి అగర్వాల్ ఈ కొత్తరకం నాప్‌కిన్‌ను రూపొందించారు.

Sanitary Napkins with Banana Fibre