Home ఎడిటోరియల్ పారిశుద్ధ్య కార్మికుల పాణాలకు విలువ లేదా!

పారిశుద్ధ్య కార్మికుల పాణాలకు విలువ లేదా!

Sanitation-workersకరువు, వర్షాభావం, వ్యవసాయరంగ సంక్షోభం, ఉపాధి పనులలేమి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బతుకుదెరువు కోసం నిత్యం హైదరాబాద్‌కు వలస వస్తున్నరు. ఈ వచ్చిన వారిలో అక్షరజ్ఞానం ఉన్న కొంతమంది సెక్యూరిటీ గార్డులుగా, అక్కడక్కడా వాచ్ మెన్‌లుగా చేరుతున్నరు. చదువు అంతగారాని వారు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నరు. ఈ పనుల్లో పెద్దగా లైఫ్‌కు రిస్క్ లేదు. అయితే దినసరి వేతనాలపై డ్రైనేజి క్లీనింగ్ పనిలో ఉన్నవారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ పాణాలు కోల్పుతున్నరు. ఇటీవలి కాలంలో దాదాపు 25 మంది హైద్రాబాద్‌లో డ్రెయినేజి శుభ్రం చేస్తూ మరణించారు. ఈ చనిపోయిన వారిలో జిహెచ్‌ఎంసి కాంట్రాక్టు ఉద్యోగులు, దినసరి కూలీలు ఉన్నరు. ప్రమాదాల బారినపడి చిన్నాభిన్నమైన కుటుంబాలను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సభ్య సమాజం అత్యంత నీచంగా చూస్తూ, ఏహ్యతను వ్యక్తం జేసే మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు మిథేన్ గ్యాస్, హైడ్రోజన్ సల్ఫయిడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషపూరిత వాయువులను పీల్చి చనిపోతున్నరు. హైదరాబాద్ ఇవ్వాళ గ్లోబల్ సిటీ. బ్యూటిఫుల్ సిటీ. వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు వ్యాపార లావాదేవిల కోసం హైదరాబాద్‌ని సందర్శిస్తున్నరు. టూరిజం, హెల్త్ రంగాలు కొత్త పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లోని వాళ్లు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లు. హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను, గంగా జమున తెహజీబ్‌ని దేశమంతటా చాటుతున్న అన్‌పెయిడ్ ప్రచారకులు. వీళ్ళను సంతృప్తి పరచడానికి, ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

షీ టీవ్‌‌సు, షటిల్ బస్సులు, హైటెక్ శౌచాలయాల ఏర్పాటు అన్నీ ఇందులో భాగమే! ఇవన్నీ హైటెక్, సైబరాబాద్, జూబిలీ, మాధాపూర్ ఇట్లా సంపన్నులు నివసించే ప్రాంతాలకే పరిమితం. అయితే అచ్చంగా హైదరాబాద్ భూమిపుత్రు లు ఇప్పటికీ మూడ్రూపాయలిచ్చి మూత్ర విసర్జన చేయా ల్సిన స్థితి ఉన్నది. ఏ బస్టాండ్‌లో నిలబడ్డా మురుగు వాసన ముక్కుపుటాలను బద్దలు చేస్తది. ఇందు కోసం 2000ల చెత్త సేకరణ ఆటోలను సమకూరుస్తున్నది. అట్లనే జిహెచ్‌ఎంసి ఉద్యోగి 16 యేండ్లుగా సెలవు తీసు కోకుండా పనిచేసినందుకు పట్టణాభివృద్ధి శాఖ అతన్ని దేశంలోనే అత్యుత్తమ కార్మికుడిగా గుర్తిం చింది. అందు కు ప్రధాని మోడీ అభినందనలు కూడా అందుకున్నడు. యాప్ ద్వారా ఎక్కడ మురుగు నీరు పారుతుందో, ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సలహాలు అందుకునేందుకు జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. పాలనలో ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పించి వారి మాటకు విలువ ఇస్తున్నరు. సంతోషం. అంత మంచిగనే ఉన్నది కానీ అట్టడుగున, భూగర్భ డ్రెయినేజీల్లో పనిచేసే టోళ్ళ పాణాలకు విలువ లేకుండా పోయింది. వారి బతుక్కు భరోసా లేకుండా పోయింది. పోయిన వారం హైదరాబాద్‌లో అధునాతనమైన మాదాపూర్ ప్రాంతంలోని అయ్యప్ప నగర్‌లో నాలాలు క్లీన్ చేసేందుకు బిలంలోకి దిగిన ముగ్గురు కార్మికులు, వారికి సహాయం చేయబోయిన ఒకతను మొత్తం నలుగురూ విషవాయువులు పీల్చి అక్కడికక్కడే చనిపోయిండ్రు. ఇది మొదటి సంఘటన కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలాంటివి అనేక సంఘటనలు జరిగాయి.

మ్యాన్‌హోల్స్ మీద మూతలు లేక పోవడం మూలంగా పాదచారులు, మ్యాన్‌హోల్స్ క్లీన్ చేస్తూ కూలీలు దాదాపు 25 మంది ఇటీవలి కాలంలో చనిపోయారు. 2016 మేడే రోజు సుల్తాన్‌బజార్‌లోని కపాడియా లేన్‌లో నాలాలు క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు విషవాయువులు పీల్చి కోటయ్య, వీరయ్యలు మరణించారు. అంతకు ఆర్నెళ్ళ ముందు అడిక్‌మెట్ ప్రాంతంలో రాములు అనే వ్యక్తి నాలా బిలంలోకి దిగి చని పోయిండు. అంతకుముందు ఇదే మాదాపూర్ ప్రాంతం లో హేమంత్‌రాయ్ అనే వ్యక్తి ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు. అలాగే సికింద్రాబాద్ ఏరియాలో ఒక గర్భిణి స్త్రీ నాలాలో పడి చనిపోయింది. ఒలిఫెంటా బ్రిడ్జి సమీపంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. గతంలో సత్యం అనే వ్యక్తి 30 అడుగుల లోతున ఉన్న నాలాను క్లీన్ చేస్తూ మాదాపూర్ ఏరియాలో భార్యబిడ్డలు చూస్తుండగానే ఆక్సిజన్ అందక చని పోయిండు. ఆయనను రక్షించ డానికి ప్రయత్నించిన ఆంజనేయులు అనే వ్యక్తి కూడా ఈ సంఘటనలో మృతి చెందిండు. ఇది జిహెచ్‌ఎంసి పట్టిపర్వాలేని తనాన్ని పట్టిస్తుంది. 2016-17 సంవత్సరానికి గాను గ్రేటర్ హైదరా బాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 5,550కోట్లు. అయినా ప్రజలకు వసతులు మాత్రం అరకొరగానే అందు తున్నయి. వర్షాకాలం వస్తే చాలు రోడ్లన్నీ మురికి నీరుతో జీవనదుల్ని తలపిస్తాయి. హైదరాబాద్ మురుగు శుభ్రతకు సంబంధించి రోజుకు దాదాపు 300-400ల ఫిర్యాదులు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సప్లయ్ అండ్ సివరేజి (జలమండలి)కి అందుతాయి.

అలాగే ఈ మురుగును క్లీన్ చేసేందుకు ప్రస్తుతం 42 ఎయిర్‌టెక్ క్లీనింగ్ యంత్రాలున్నాయి. ఇందులో 12 మాత్రమే జల మండలివి. మిగతా 32 యంత్రాలకు మండలి రెంట్ చెల్లిస్తోంది. ఇవి కూడా అన్ని సర్కిళ్ళలో లేకపోవడం మూలంగా హైదరాబాద్ మురుగు నీటి శుభ్రత అస్తవ్యస్తంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు నాలుగున్నర లక్షల మ్యాన్‌హోల్స్ ఉన్నయి. ఇందులో రెండున్నర లక్షలు జిహెచ్‌ఎంసి పర్యవేక్షలో ఉండగా మిగతా వాటి బాధ్యతను జలమండలి చూస్తున్నది. దాదాపు మూడు లక్షల జనాభా అవసరాలకు అను గుణంగా నిజాం కాలంలో నిర్మించిన డ్రెయినేజి వ్యవస్థనే ఇప్పటికీ నడుస్తోంది. 1908లో మూసీ నదికి వరదలు రావడంతో దాదాపు సగం హైదరాబాద్ మునిగి పోయింది. దీంతో అప్పటి నిజాం మహబూబ్ అలీఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి సమస్యకు పరి ష్కారం వెతకమని కోరగా ఆయన వరద నీరు మూసీలో కలిపేందుకు వీలుగా అధునాతనమైన మ్యాన్‌హోల్ పద్ధతిని సూచించాడు. అయితే ఈ పద్ధతికి మురుగు నీరు కూడా పోయే విధంగా మార్పుల్ని అప్పటి హైదరా బాద్ ఇంజనీర్ స్టోన్ బ్రిడ్జ్ సూచించాడు. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ 1911లో హైదరాబాద్‌లో భూగర్భ డ్రెయినేజి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇది 1921లో పూర్తయింది. అంటే హైదరాబాద్ డ్రెయినేజీ వ్యవస్థ దాదాపు 100 ఏండ్ల పాతది. ఇప్పుడు జనాభా 60 లక్ష లు దాటింది. అప్పుడు వేసిన మ్యాన్‌హోల్స్ ఐరన్ క్యా స్టింగ్‌తో ఉండడంతో వాటినన్నింటిని ఇంటి దొంగలు కొన్ని, బయటి దొంగలు కొన్ని మొత్తంమీద అన్నీ మాయంజేసిండ్రు. నిజాం జమానాలో నిర్మించిన ఈ డ్రెయినేజిని నిర్వహించడం జిహెచ్‌ఎంసికి కష్టసాధ్య మౌతోంది.

హైదరాబాద్‌లో పెరిగిన జనాభాకు అనుకూలంగా సిబ్బంది కానీ, క్లీనింగ్ యంత్రాలు గానీ లేవు. నిజానికి మలవిసర్జాలను చేతితో ఎత్తడం, మరుగుదొడ్లను శుభ్ర పరచడాన్ని 1993లోనే నిషేధిస్తూ భారతప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ నేరం. దీన్ని మరింత పటిష్టపరుస్తూ 2013లో సవరణలు కూడా తీసుకువచ్చారు. అయినప్ప టికీ ఈ నేరాన్ని జిహెచ్‌ఎంసి రోజూ చేయిస్తున్నది. హైదరాబాద్‌లోని నాలాల్లో పనిచేయడం చాలా కష్టమైన పని. ఓక్కో బిలం దాదాపు 30 అడుగుల లోతు వరకు కూడా ఉన్నది. మాదాపూర్‌లో చనిపోయిన సత్యం అనే కార్మికుడు ముదిరాజ్ కులస్తుడు. అంటే ఈ పారిశుద్ధ్య పనుల్లో అన్ని కులాల వారు ఉన్నారనే విషయం అర్థమైతుంది. లోతైన బిలంలో పనిచేసే ముందు దాంట్లో విషవాయువులు ఉన్న విషయాన్ని కనుక్కోవడానికి లాంతరుని బిలంలోకి విడువడం గానీ, మంటనుగాని, కోడి పిల్లను దారానికి కట్టిగాని సంప్రదాయంగా విషవాయువుల్ని చెక్ చేసేవారు. అంతేగా కుండా శిక్షణ పొందిన కార్మికు లున్నట్లయితే వాళ్ళు పని చేస్తున్న బిలానికి అటు ఇటుగా ఉన్న మ్యాన్‌హోల్స్‌ని తెరచి ఉంచుతారు. దీనివల్ల విషవాయువులు బయటికి పోతాయి. అయి తే ఈ సిబ్బంది తగినంతమంది లేక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో దినసరి కూలీల చేత క్లీనింగ్ చేయి స్తుంటారు.

అది కూడా ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. గతంలో సుల్తాన్‌బజార్‌లో జరిగిన సంఘ టనపై హైకోర్టు జోక్యం చేసుకొని ఫిర్యాదు అందిన వెంటనే డ్రెయినేజీని క్లీన్ చేసేందుకు తగిన చర్యలు చేపట్ట నందుకు జిహెచ్‌ఎంసీకి చివాట్లు పెట్టింది. నాలాలు క్లీన్ చేసే కార్మికులకు కనీసం మాస్కు లు, డ్రెస్ లు, గ్లవ్స్‌లు, హెడ్‌మాస్ట్ (లైట్స్) కూడా సరఫరా చేయ లేని దుస్థితిలో జలమండలి, జిహెచ్‌ఎంసి ఉన్నది. ఈ నాలాల నిర్వ హణ కూడా జిహెచ్‌ఎంసీ, జలమండలి మధ్యలో ఉన్న ది. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు దానికి తమ బాధ్యత ఏమీ లేదంటూ ఎవరికి వారు చేతులెత్తే స్తారు. నిజానికి మొన్న జరిగిన సంఘటనలో బ్లాక్‌లిస్టు లో పెట్టిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం వల్ల జరి గింది. ఈ నెల 13వ తేదీన మాదాపూర్‌లో జరిగిన దుర్ఘ టనలో సత్యనారాయణ, నగేష్, శ్రీనివాస్ అనే దినసరి కూలీలు చనిపోయిండ్రు. వీరిని కాపాడేందుకు ప్రయ త్నించిన దారినబోయే క్యాబ్ డ్రైవర్ గంగాధర్ కూడా మృతిచెందిండు. ప్రభుత్వం కొంత తక్షణ సహా యాన్ని ప్రకటించింది. మృతులకు పది లక్షల ఎక్స్ గ్రేషియాను మున్సిపల్ మంత్రి కె.టి.రామారావు ప్రకటిం చారు. ఏది ఏమైనా పోయిన ప్రాణాలను తీసుకు రాలేము. బతి కుండి పనిచేస్తున్న ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పిం చాలె. చట్టం నిర్దేశించిన విధంగా మ్యానువల్ స్కావెం జింగ్‌ని రద్దుచేసి ఇందుకోసం పూర్తి స్థాయిలో యంత్రా లను వినియోగించాలి.