Home దునియా అలోవెరా జెల్‌తో శానిటైజర్ తయారీ

అలోవెరా జెల్‌తో శానిటైజర్ తయారీ

aloe-vera-gel

ఇప్పుడున్న పరిస్థితుల్లో శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది. చేతులు శుభ్రంగా ఉంచడంలో వీటిపాత్ర ఎనలేనిది. ఇంట్లోనే దీన్ని తయారుచేసుకోవడం ఎలాగో చెబుతున్నారు నిపుణులు.

కావాల్సినవి : అలోవెరా జెల్ మూడు టేబుల్ స్పూన్లు, విటమిన్ ఇ ఆయిల్- అర చెంచా, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్- ఇరవై చుక్కలు, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్- పది చుక్కలు, ఆల్కహాల్- ఒక చెంచా ఉండాలి.

తయారీ : వీటన్నింటినీ పెద్ద మగ్గులో తీసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత సీసాలో లేదా ఇంట్లో వాడేసిన ఫేస్‌వాష్ ట్యూబ్‌లలో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. ఈ మిశ్రమం ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.

Sanitizer preparation with aloe vera gel