Home జాతీయ వార్తలు కరెన్సీ నోట్లను శానిటైజ్ చేసే యువి పరికరం

కరెన్సీ నోట్లను శానిటైజ్ చేసే యువి పరికరం

Sanitizing currency notes made easy with us device

 

చండీగఢ్: ఆహార పొట్లాలు, కరెన్సీ నోట్లు సహా పలు వస్తువుల్ని క్రిమిరహితం(శానిటైజ్) చేయగల యువి రేడియేషన్(అతి నీలలోహిత కిరణాలను వెదజల్లే) పరికరాన్ని జలంధర్‌లోని డా॥బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) రూపొందించింది. చేతిలో పట్టుకు వెళ్లగలిగే సైజ్‌లో ఉండే ఈ బాక్స్‌కు టైమర్ అమర్చారు. క్రెడిట్ కార్డులు, పేపర్లు, ఫైళ్లు, వినియోగించిన మాస్క్‌లు, తాళం చెవులు, వగైరా వస్తువుల్ని ఈ యువి పరికరం క్రిమి రహి తం చేయగలదని నిట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా వస్తువులపై ఉండే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ క్రిముల్ని యువి కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా అంతమొందించవచ్చునని పేర్కొన్నది.

తాము రూపొందించిన యువి పరికరంలో ఎటువంటి రసాయనాలు, క్రిమి సంహారకాలు ఉండవని ఎన్‌ఐటి తెలిపింది. యువి కిరణాలను ఆయా వస్తువులపై కొన్ని సెకండ్లపాటు ప్రసరింపజేయడం ద్వారా క్రిమి రహితం చేయగలదని పేర్కొన్నది. చిన్నారులు, పెద్ద లు ఎవరైనా దీనిని సురక్షితంగా వినియోగించవచ్చునని తెలిపింది. నిట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్‌కె అవస్తి, డాక్టర్ కుల్‌దీప్‌సింగ్ నాగ్లా దీనిని రూపొందించారు. ఇప్పటికే కొన్ని యువి పరికరాలు మార్కెట్‌లోకి వచ్చాయని, తాము రూ పొందించిన పరికరంలో టైమర్‌లాంటి అదనపు సౌకర్యాలున్నాయని వారు తెలిపారు. కరెన్సీ నోట్లను డిస్‌ఇన్‌ఫెక్ట్ చేయాలంటే వాటిపై 120 సెకండ్లపాటు యువి కిరణాల ను ప్రసరింపజేయాలని తెలిపారు. ఆహార పొట్లా లు, బాటిళ్లులాంటి వాటిపై 300 సెకండ్లు, ఇంకాస్త ఎక్కువ సమ యం యువి కిరణాలను వినియోగించాలని తెలిపారు.