Home జాతీయ వార్తలు మోడీ మోడ్రన్ ఔరంగజేబు: సంజయ్

మోడీ మోడ్రన్ ఔరంగజేబు: సంజయ్

Sanjay Nirupam and PM Modiవారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది అక్కడి దేవాలయాల్లో వసూలు చేస్తున్న చార్జీలపై రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న అజయ్ రాయ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ సీనియర్ లీడర్ సంజయ్ నిరూపం ప్రధాని మోడీపై దుమ్మెత్తిపోశారు.మోడీని మొఘల్ రాజు ఔరంగజేబు మోడ్రన్ అవతారంగా పేర్కొన్నారు సంజయ్. మీడియాతో మాట్లాడిన సంజయ్… వారణాసి ప్రజలు గత ఎన్నికల్లో ఎవరినైతే ఎన్నుకున్నారో అదే మన ప్రధాని మోడీ… ఆయన ఔరంగజేబు ఆధునిక అవతారం అని నాకు అనిపిస్తోంది.

మొఘల్ రాజు ఔరంగజేబు తన పాలన కాలంలో బనారస్ లో ఏదైతే చేయలేక పోయాడో.. అది ఇక్కడ ప్రధాని మోడీ చేసి చూపించారు. కారిడార్ పేరుతో వారణాసిలో ఆ సంఖ్యంగా ఆలయాలను ధ్వంసం చేయించారు. అప్పట్లో ఔరంగజేబు వారణాసిలో దేవాలయాలను ధ్వంసం చేయాలని తలిచినప్పుడు ఇక్కడి ప్రజలు ఆయనకు ఎదురొడ్డి ఆలయాలను రక్షించుకున్నారు. కానీ, మోడీ పాలనలో అది కుదరలేదు. దాంతో వేల సంఖ్యలో ఆలయాలు నేలమట్టం అయ్యాయి. ఇప్పుడు ప్రజలు విశ్వనాథుడిని దర్శించుకునేందుకు రూ. 550 చెల్లించక తప్పడం లేదని విమర్శించారు. దేవుణ్ని దర్శించుకునేందుకు కూడా మోడీ సర్కార్ భక్తులకు ఫైన్, చార్జీలు వేస్తుండడం బాధకరమన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సంజయ్ అన్నారు.

Sanjay Nirupam Says PM Modi is Modern Avatar of Aurangzeb