Tuesday, March 21, 2023

తెలుగు లోగిళ్లలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు

- Advertisement -

kranthi

మనతెలంగాణ/నిజామాబాద్ కల్చరల్: తెలంగాణ ప్రజల మూడు రోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి పర్వదినం జిల్లా వాసులు సంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకు న్నారు. సోమవారం మకర సంక్రాంతిని పురస్కరించుకొని గాయత్రి నగర్ ఎల్లమ్మ గుట్ట కంఠేశ్వర్ జెండా బాలజీ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాయణ పర్వ దినం సూర్యదేవుని ప్రీతి కొరకు నమకచమక సూర్య రుద్రాభిషేకాలు చేసి భక్తులు తీర్థ ప్రసాద వితరణ చేశారు. జిల్లా మన బ్రాహ్మణ సమాజం గాయత్రి ధార్మిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ సూర్యహో మాన్ని అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి గీతా భవనంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాయత్రి ఉపాసకులు బ్రహ్మశ్రీ రాజమౌళి శర్మ మాట్లాడుతూ సూర్య భగవా నుడు ప్రతినెల ఒక రాశిలో ప్రవేశి స్తాడని పుష్య మా సం మకరరాశి ప్రవేశించడంతో మకర సంక్రాంతిని జరుపుకోవడం అనవాయితీగా వస్తోందని అన్నారు. సౌభాగ్యం కోసం సుహాసినులు గౌరీ వ్రతం ఆచరించి తోటి మహిళలకు పసుపు కుంకుమ గాజులు అందజేసి ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతు ందని చెప్పారు. చిన్న పిల్లలు గాలిపటాలు ఎగురవేయడం వల్ల సూర్య భగవానుడి నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాల వల్ల కంటిచూపు కాంతివంతం అవుతుందని వివరి ంచారు.
ఈ ధార్మిక కార్యక్రమంలో గాయత్రి ధార్మిక వేదిక ప్రధా న కార్యదర్శి సౌమ్య మేడిచర్ల ప్రభాకర్‌రావు వీణా స్వామి ప్రకాష్‌శర్మ, సుభాష్‌రావు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News