Saturday, April 20, 2024

రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao

 

హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు.  లాక్‌డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో రోగి వెంట ఉండేవారికి రెండు పూటలా భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. రేపటిలోగా మాస్కులు, కిట్లు పంపించాలని వైద్య ఆరోగ్య శాఖ ఎండికి ఫోన్‌లో హరీష్ ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో పంపిణీకి సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతీ రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎంఎల్‌ఎ శేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

 

Santizer, water in Ration shops says Harish rao
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News