Friday, December 2, 2022

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సంతోష్ కుమార్

- Advertisement -

Santosh Kumar Visits Kondagattu Sri Anjaneyaswamy  జగిత్యాల : కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ శుక్రవారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆంజ‌నేయ‌స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఆయన జ‌మ్మి మొక్కను నాటారు. విశ్వక్సేన ఆలయం నిర్మించేందుకు తన వంతు సహకారం అందిస్తానని సంతోష్ కుమర్ హామీ ఇచ్చారు. ఆంజ‌నేయ‌స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మల్యాల, కొడిమ్యాల మండల టిఆర్ఎస్ నాయకులతో  చర్చించారు.  రామ్మోహన్ రావు, సుదర్శన్, మధుసూదన్రావు, రామలింగారెడ్డి, ఉమ, రాజనరసింగరావు, కృష్ణారావు, స్వర్ణలత తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles