Friday, June 14, 2024

క‌రీనా రెండో కుమారుడిని పరిచయం చేసిన సారా..

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లు తమ రెండో కుమారుడిని ఇప్పటివరకు ప్రపంచానికి పరిచయం చేయలేదు. వీరి మొదటి కుమారుడు తైమూర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రెండో కుమారుడి(జెహ్)ని మాత్రం చాలా సీక్రెట్‌గా దాస్తూ వ‌చ్చారు ఈ స్టార్ కపుల్. కానీ, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్, జెహ్ ని ప్రపంచానికి ప‌రిచ‌యం చేసింది. త‌న తండ్రికి బ‌ర్త్‌డే విష్ చేస్తూ.. ఓ ఫొటోని త‌న ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ ఫోటోలో కరీనా, సైఫ్ ల రెండో కుమారుడు ఉన్నాడు. ఇందులో సారా, సైఫ్ లతో పాటు కరీనా జెహ్ ని చేతుల్లో ఎత్తుకుని ఉంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు జెహ్ ఎంతో ముద్దుగా ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఫిబ్రవరి 2021లో కరీనా రెండో కొడుకుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అత‌నికి ‘జెహ్’ అని పేరు పెట్టారు. ‘జెహ్’ అంటే ‘బ్లూ క్రెస్టెడ్ బర్డ్’ అని అర్థం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News