Tuesday, April 16, 2024

‘సరాసరి…’గా రొమాన్స్

- Advertisement -
- Advertisement -

నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలోని మరో గీతం ఆదివారం యుట్యూబ్ ద్వారా విడుదలైంది. నితిన్, రష్మిక బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చగా గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుంది ఈ పాట. ‘సరాసరి…’ పేరుతో విడుదలైన ఈ గీతానికి సంగీత ప్రియులు, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ..“ఈ చిత్రంలోని మరో గీతం ‘సరాసరి…’కి ప్రేక్షకాభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ గీతానికి శేఖర్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. ఇక ‘భీష్మ’ చిత్ర కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వినోద ప్రధానంగా సాగుతుంది”అని తెలిపారు. నరేష్, సంపత్,ర ఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ : సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి.

Sara Sari.. lyrical Song released from Bheeshma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News