Home తాజా వార్తలు సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారూ…

సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారూ…

Sarileru Neekevvaru

 

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్‌స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ఇంట్రో టీజర్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారూ.. సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు…’ అంటూ సాగే ఈ టీజర్‌లో మహేష్ సైనికుడి గెటప్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు.

దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్నారు. రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్.టి, ఎస్.కృష్ణ ఈ చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Movie Intro Teaser release