Home తాజా వార్తలు సంక్రాంతి కానుకగా…

సంక్రాంతి కానుకగా…

Sarileru Neekevvaru

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్ మొదటి షెడ్యూల్ శుక్రవారం ముగిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మహేష్ బాబుతో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు.

ఇక రెండవ షెడ్యూల్ ఈ నెల 26 నుండి హైదరాబాద్‌లో జరుగనుంది. దీని కోసం హైదరాబాద్‌లో సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ నిర్మించారు. అనిల్ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయాలని ప్లాన్ చేశారు. ఇందులో కథానాయకిగా రష్మిక మందన్న నటిస్తోంది. మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sarileru Neekevvaru Movie Release to Sankranthi