Home తాజా వార్తలు కొండారెడ్డి బురుజు సెట్‌లో చిత్రీకరణ

కొండారెడ్డి బురుజు సెట్‌లో చిత్రీకరణ

Sarileru neekevvaru

 

సూపర్ స్టార్ మహేష్‌బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు సెట్‌ను సృష్టించారు ఫిల్మ్‌మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ సెట్‌లోనే జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు రాజేంద్ర ప్రసాద్, ఇతర ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ట్విట్టర్‌లో మరో రికార్డ్
టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో మహేష్ బాబుకు ట్విట్టర్‌లో అందరి కన్నా ఎక్కువ ఫాలోవర్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ట్విట్టర్ రికార్డు మహేష్ ఖాతాలోకి వచ్చి చేరింది. ఈ సూపర్‌స్టార్ నటించిన ‘మహర్షి’ చిత్రంతో ఈ రికార్డు అతని సొంతం అయింది. ఇటీవల ‘మహర్షి’ చిత్రం 3 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా 2019 ప్రథమార్థంలో ఇండియాలోని టాప్ 5 ట్విట్టర్ ట్యాగ్స్ విడుదల చేశారు. వీటిలో 4వ స్థానంలో సూపర్ స్టార్ ‘మహర్షి’ చిత్రం ఉంది. ప్రథమ స్థానంలో తమిళ్ స్టార్ అజిత్ చిత్రం ‘విశ్వాసం’, రెండు, మూడు స్థానాల్లో లోక్ సభ ఎలెక్షన్స్ 2019, క్రికెట్ వరల్డ్ కప్ 2019 ఉన్నాయి. ఇక టాప్ 5లో రెండు సౌత్ సినిమాలు ఉండడం విశేషం. ఇలాంటి అరుదైన రికార్డు మహేష్ బాబు సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.

Sarileru neekevvaru shooting at Konda Reddy buruju