Tuesday, April 23, 2024

ఆ రోజున ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

Sarkaru vaari paata special gift for Mahesh babu fans

 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకులు, అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ నెలలోనే ఈ సినిమా నుండి అభిమానుల కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ రానుంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 31న ఈ గిఫ్ట్ రావడం ఖరారైంది. అయితే అది ఏంటా అన్నది ఆసక్తిగా మారింది. ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని ఎలాగో టాక్ ఉంది. కానీ అంతకు మించిన ట్రీట్ ఏదన్నా ఉందా అన్నది అసలు టాక్. అయితే ఆరోజు టీజర్ కూడా వస్తుందనే ఊహాగానాలు ఇప్పుడు వస్తున్నాయి. కానీ అది మహేష్ బర్త్ డేకు ప్లాన్ చేసినా… గ్లింప్స్ రిలీజ్‌కి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాలి. మరి వీటిలో ఏది వచ్చినా మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మరి ఫిల్మ్‌మేకర్స్ నుంచి ఏ గిఫ్ట్ వస్తుందో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News