Wednesday, March 22, 2023

పరోక్ష ఎన్నికలపై సర్పంచ్ ఆశావాహుల్లో ఆందోళన

- Advertisement -

sarpanch

*భారీగా పెరగనున్న ఖర్చు
*క్యాంపు, డబ్బు రాజకీయాలకు అవకాశం
*వార్డు సభ్యులకు భారీగా డిమాండ్
*కఠినమైన చట్టం తేకపోతే ఇబ్బందే
*కొత్త విధానంపై భిన్నాభిప్రాయాలు

మన తెలంగాణ/కోహెడ : వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయంతో సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్న గ్రామ స్థాయి నాయకుల్లో గుబులు మొదలైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికలు సర్పంచి ఎన్నుకునే విధానం నేరుగా ఉండేది. వార్డు సభ్యులది మరోలా ఉండేది. ఇద్దరికీ వేర్వేరు బ్యాలెట్ పేపర్‌లు ఉండేవి. గ్రామంలో 10 మంది వార్డు సభ్యులు ఉంటే 9 మంది ఓ పార్టీ మద్దతుదారు లు గెలిచినా సర్పంచ్ మరో పార్టీ మద్దతుదారు అయినప్పటికీ అయన గెలిస్తే అయనే సర్పంచ్. దీనికి ఆనేక కారణాలు గ్రామ స్థాయి రాజకీయాల్లో ఉం డోచ్చు. సర్పంచ్ అభ్యర్థి మంచివాడు అయితే ఓటరు అతనికి డైరెక్టుగా ఓటు వేసుకునేవారు. వార్డు సభ్యుడికి ఓటరు ఇష్టంగా మరొకరికి వేసేవారు. ఆ తర్వాత ఉప సర్పంచ్‌ను ఎన్నుకునే వద్ద మాత్రం ఎక్కువ వార్డు సభ్యుల మద్దతు ఉన్నవారిలో ఒకరిని ఎన్నుకునేవారు. అదే పద్ధతిలో గెలిచిన వార్డు సభ్యులందరూ కలిసి ఇక గ్రామ సర్పంచ్‌ని ఎన్నుకునే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇది అమలైతే ఇక సర్పంచ్ పదవి కావాలనుకునే వ్యక్తి తప్పనిసరిగా వార్డు సభ్యునిగా గెలవాల్సి ఉంటుంది.
సర్పంచ్ ఆశావహుల్లో ఆందోళన.. గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించే వారు వచ్చే ఎన్నికల రిజర్వేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ముందు చూపుగా కింది స్థాయిలో పనులు చేస్తుంటారు. ఇందులో కూడా ఏ ఇంట్లో ఎవరికి ఓట్లు ఎక్కువగా ఉంటాయో వారికే కొమ్ము కాస్తుంటారు. ఇక పార్టీల మీటింగ్‌లకు వారు ఖర్చులు భరిస్తుంటారు. ఇలా ప్రజలతో ఉంటూ వారితో మమేకమవుతారు. అయితే ఈసారి పరోక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటున్న పరిస్థితుల్లో సర్పంచ్ అశావహుల్లో ఆందోళన నెలకొంది.
వార్డు సభ్యులకు పెరగనున్న డిమాండ్.. ఇప్పటి వరకు సర్పంచ్ అభ్యర్థిని పార్టీ నాయకులు పార్టీలో గెలుపొందే వారిని గుర్తించి వార్డు సభ్యునిగా నిలబెడతారు. వారే సంబంధించిన పన్నులను కట్టి నామినేషన్ కూడా వేయిస్తారు. ఖర్చు కూడా సర్పంచ్ అభ్యర్థి కొంత వార్డు సభ్యులు కొంత పెట్టుకునేవారు. కా నీ ఇక నుంచి సర్పంచ్ అభ్యర్థిని వార్డు సభ్యులు ఎన్నుకోవాలి. కనుక సర్పంచ్ అభ్యర్థి ఖర్చు మొత్తం పెట్టి గెలిపించిన తర్వాత వెంట ఉంటాడో..ఉండడో అని మరో గుబులు. ఇంకొందరు వార్డు సభ్యుడే సర్పంచ్‌ను ఎన్నుకోవాలి కాబట్టి అయా వార్డుల్లో పేరున్న వ్యక్తి ఆర్థికంగా ఉన్నవారు గెలుపొంది ఆ తర్వాత వారు ఖర్చు చేసిన దానికి రెండింతలు ఆడిగినా ఇస్తారనే ఆలోచనతో ఎక్కువ మంది పోటీల్లో ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో కఠినమైన చట్టం తీసుకొస్తే తప్ప క్యాంపు రాజకీయాలను ఆపడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. గెలుపొందిన వార్డు స భ్యుడు ఫలితాల వరకు అక్కడే లేకపోతే ఎలా సర్పంచ్ ఎన్నిక వాయిదా పడితే అనంతరం జరిగే పరిణామాలు ఎలా ఉంటాయోనని పలువురు చర్చించుకుంటున్నారు. కొందరు బాగుంటుందని మరికొందరు బాగోదని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ పరోక్ష విధానం అమలు అసాధ్యమని, ఒకవేళ పార్టీ గుర్తుతో పాత పద్ధతిలో పెట్టవచ్చని మరి కొందరు అంటున్నారు.
జవాబుదారీతనం తగ్గుతోంది : టి.ఎల్లయ్యగౌడ్, మాజీ సర్పంచ్
పరోక్ష పద్ధ్దతిలో సర్పంచ్ ఎన్నికలు జరిగితే జవాబుదారీతనం తగ్గుతుం ది. స్థానికంగా సమస్య వస్తే సర్పంచ్‌ను ప్రశ్నించే హక్కును ఓటరు కో ల్పోతాడు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌ను నేరుగా ఎన్నుకోవడం పెద్ద సమ స్య కాదు. ఈ పద్ధతి ప్రజామోద యోగ్యం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News