Home జనగామ పాలకుర్తి ప్రజలకు పాదాభివందనం: ఎర్రబెల్లి

పాలకుర్తి ప్రజలకు పాదాభివందనం: ఎర్రబెల్లి

గ్రామాలను అభివృద్ది పథంలో నిలపడమే ధ్యేయం
సర్పంచ్‌లు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
అత్మీయ సన్మాన సభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Errabelli Dayakar Rao

 

మన తెలంగాణ/దేవరుప్పుల: భారీ విజయాన్ని అందించిన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు పాధాభివందనం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్‌లో సోమవారం జరిగిన టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాలను అభివృద్ది పథంలో నిలపడమే ధ్యేయంగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లోని స్థితిగతులు ఎరిగిన వాడిగా .. గ్రామాల సమస్యలను తీర్చేందుకు అహర్నిశలు కృషి చేసి సిఎం కెసిఆర్‌తో శెభాష్ అనిపించుకుంటానన్నారు. సర్పంచులకు అధికారాలు, నిధులు ఇస్తున్నామని, గ్రామాల్లో అవినీతి లేని అభివృద్ధికి కృషిచేయాలన్నారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు స్థానికంగా ఉండి గ్రామాల్లో సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. నేడు పంచాయతీరాజ్ చట్టాలు కఠినంగా ఉన్నాయని, సర్పంచ్ లు తప్పులు చేస్తే పదవి పోయినట్లే అని అన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని, సిఎం కెసిఆర్ నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

పాలకుర్తి నియోజకరవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని, కార్యకర్తలు కూడా ఎలాంటి తప్పులు చేయవద్దని, తనకు చెడ్డపేరు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఏ ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ గాందీనాయక్, ఎంపిసి కొల్లూరి సోమయ్య, జిల్లా గ్రాంధాలయ డైరెక్టర్ కారుపోతుల బిక్షపతి, మండల రైతు సమన్వయ సమతి కోఆర్డినేటర్ ఈదునూరి నర్సింహారెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు బస్వ మల్లేష్, తెరాస నాయకులు దయాకర్, జలేందర్‌రెడ్డి, మోలుగూరి రమేష్, చింత రవి, ఖాసీమ్, రమేష్‌రెడ్డి, రాజు, సోమయ్య, లాలు నాయక్, పలు గ్రామాల ప్రజా ప్రతినిదులు, తెరాస కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Telangana news

 

Sarpanch’s Don’t Corruption in Villages: Errabelli Dayakar