- Advertisement -
చెన్నై : తమిళనాడు ఇంచార్జీ గవర్నర్తో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ ముగిసింది. గవర్నర్తో దాదాపు 30 నిమిషాలు భేటీ అయిన శశికళ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆమెకు సమర్పించారు. ఆమెకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఫైల్ ను ఆమె గవర్నర్ కు అందించారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆమె గవర్నర్ని కోరారు. తనకు ఉన్న సంఖ్యా బలంతో పాటు అన్నాడిఎంకె శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విషయాన్ని గవర్నర్కు వివరించినట్టు సమాచారం.
- Advertisement -