Friday, January 27, 2023

‘ఆ కోణంలో విచారణ జరిపితే శశికళకు జీవితఖైదు పడొచ్చు’

- Advertisement -

MK-Stalinచెన్నై : తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకె నిర్వహించిన ఒక రోజు నిరాహార దీక్షలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ పాల్గొన్నారు. దీక్ష అనంతర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిరాహార దీక్షలు తమ కోసం కావని.. రాష్ట్రంలో ఏర్పడిన బినామీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని తెలిపారు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళపై ఆయన విమర్శలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి మృతి చెందిన తీరుపై సరైన విచారణ జరిపితే శశికళకు నాలుగేళ్లు కాదు.. జీవిత ఖైదు పడొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా డిఎంకె సభ్యలను బలవంతంగా బయటకు పంపి, ఆ తర్వాత బలపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles