Home సినిమా ‘స్పైడర్’ శాటిలైట్ రైట్స్ రికార్డు

‘స్పైడర్’ శాటిలైట్ రైట్స్ రికార్డు

Mahesh-babu

మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ టైటిల్‌పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. తెలుగు, తమిళ్, హిందీలో ఒకే టైటిల్ ఉండాలని మహేష్ గట్టిగా చెప్ప డంతో అందుకు దర్శకుడు మురుగదాస్ కూడా సరేనన్నాడు. మూడు భాష ల్లో ఈ చిత్రం ‘స్పైడర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పుడు ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్‌ను విక్రయించేశారు చిత్ర నిర్మాతలు. సూపర్‌స్టార్ మూవీ ‘స్పైడర్’ చిత్రానికి సూపర్బ్ ప్రైజ్ ఇచ్చి కొనుగోలు చేసింది జీ నెట్‌వర్క్. మహేష్‌కు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు… మురుగదాస్ సినిమా లకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని హిందీలో కూడా ‘స్పై డర్’ను రిలీజ్ చేయబోతున్నారు. మూడు భాషలకు కలిపి శాటిలైట్ రైట్స్ ను రూ.26.5 కోట్లు చెల్లించి దక్కించుకుంది జీ నెట్‌వర్క్. టాలీవుడ్ సిని మాల్లో ఇదో భారీ రికార్డ్‌గా చెప్పుకోవాలి. బాహుబలి తర్వాత స్పైడర్‌కే అత్య ధికంగా శాటిలైట్ రైట్స్ మొత్తం దక్కింది. మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా వెచ్చిస్తు న్నట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా ‘స్పైడర్’ కొత్త రికా ర్డులు నమోదు చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.