Home జాతీయ వార్తలు జెకె, లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మాలిక్?

జెకె, లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మాలిక్?

Satya Pal Malik

 

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్‌లకు లెఫ్‌నెంట్ గవర్నర్లుగా నియమించేందుకు తగిన అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఈ అవసరం ఏర్పడింది. అక్టోబర్ 31 నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిగణనలోకి వస్తాయని ఈ పరిణామాలపట్ల అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విడివిడిగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు ఉంటారని జె అండ్ కె పునర్విభజన చట్టం నిర్వచిస్తున్నా, ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్న 73 ఏళ్ల సత్యపాల్ మాలిక్ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా వ్యవహరించవచ్చని ప్రచారం జరుగుతోంది.

రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను నియమించేదాకా మాలిక్‌ను తాత్కాలిక లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తీసుకోవచ్చని ఈ వ్యవహారాలతో సంబంధమున్న వారిలో ఒకరన్నారు. ‘ఆ పదవికి సరిగ్గా ఎవరు సరిపోతారు అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తి రాజకీయ నాయకుడైతే బాగుంటుందా? లేక ప్రభుత్వాధికారి అయితే బాగుంటుందా? అని ఆలోచిస్తున్నారు. అయితే, రక్షణమంత్రి, కేంద్ర హోంమంత్రులతో సంప్రదించి ప్రధానమంత్రి కార్యాలయం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని బిజెపికి చెందిన నిర్వాహకుడు ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంపై మాలిక్‌తో అధికారికంగా మాట్లాడలేదని, కానీ ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో ఇంతకు ముందు సమావేశమయ్యారని కూడా పార్టీ నాయకుడు చెప్పారు.

Satya Pal Malik likely to be first Lieutenant Governor of JK