శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కొత్త గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రెండు రోజుల క్రితం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సత్యపాల్ మొన్నటి వరకు బిహార్ గవర్నర్‌గా పని చేశారు. పదేళ్ల పాటు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించిన ఎస్ఎస్ వోరా స్థానంలో సత్యపాల్‌ను నియమించారు. ఈ ఏడాది జూన్‌లో పిడిపి ప్రభుత్వానికి బిజెపి మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ రాష్ట్రానికి సత్యపాల్‌ను గవర్నర్‌ను నియమించారు.