Friday, April 26, 2024

ఆ టెన్షన్ తగ్గించారు

- Advertisement -
- Advertisement -

Satyadev said thanks to audience for Timmarusu succeed

 

సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరసు’. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ “ఇది నా తొలి సక్సెస్‌ఫుల్ సినిమా సక్సెస్ మీట్. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ‘తిమ్మరుసు’ థియేటర్స్‌లో విడుదలవుతుంటే కొంత టెన్షన్ పడ్డాను. అయితే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి ఆ టెన్షన్‌ను తగ్గించారు”అని అన్నారు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ తమ సినిమాను థియేటర్స్‌లో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేష్ కోనేరు, బ్రహ్మాజీ, శ్రీచరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News