Home తాజా వార్తలు వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : సత్యవతి రాథోడ్

వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : సత్యవతి రాథోడ్

Satyavathi Rathod Election Campaign In Greater Warangalవ‌రంగ‌ల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ జోస్యం చెప్పారు. శుక్రవారం మంత్రి వరంగల్ లో టిఆర్ఎస్ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరంగల్ నగర అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసం టిఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆమె వరంగల్ నగర ప్రజలను కోరారు. అధికార దాహంతో ఓట్ల కోసం వస్తున్న బిజెపి, కాంగ్రెస్ నాయకులను నమ్మొద్దని ఆమె నగర ప్రజలను కోరారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి, తాగునీటి కొరత తీర్చిన ఘనత కెసిఆర్ దేనని ఆమె స్పష్టం చేశారు.  నగరం మరింత అభివృద్ధి చెందాలంటే , అధికార టిఆర్ఎస్ ను మాత్రమే గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజల కోసం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆమె కోరారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని ఆమె చెప్పారు. ఈ ఎన్నికల ప్రచారంలో పరకాల ఎంఎల్ఎ చల్లా ధర్మారెడ్డి, పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.