Saturday, April 20, 2024

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని మన ఊరు మనబడి కార్యక్రమం కింద నూతనంగా నిర్మించబడిన ప్రాథమిక పాఠశాల (ఇంగ్లీష్ మీడియం)భవనాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య, ఐటిడిఏ పిఓ అంకితం ఎస్పీ గౌస్ ఆలం లతో కలిసి మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని అట్టహాస ఏర్పాట్ల మధ్య వేద మంత్రోచ్ఛరణల మధ్య లాంచనంగా ప్రారంభించారు.

మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య ఐ టి డి పి ఓ అంకితం ఎస్పీ గౌస్ ఆలం పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. నూతన శోభతో సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న పాఠశాల ప్రాంగణాన్ని పాఠశాల తరగతి గదులను కలియ తిరుగుతూ అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా పూర్తయిన పాఠశాలల యొక్క వివరాలను, పాఠశాల నిర్మాణ పనులపై విద్యార్థులకు కావలసిన మెటీరియల్స్ వాటి గురించి కలెక్టర్ మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం పై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యాభివృద్ధి కోసం మండలానికి నాలుగు పాఠశాలల చొప్పున మన ఊరు మనబడి కార్యక్రమం కింద నూతనంగా భవన నిర్మాణాలు అన్ని రకాల సదుపాయాలతో ఈ జిల్లాలో 125 పాఠశాలలు ఎంపిక చేసి 13 పాఠశాల నిర్మాణాలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ప్రత్యేక గురుకులాలు ఏర్పాటుచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. డిగ్రీ కళాశాలతో పాటు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాట్లు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని స్పష్టం చేశారు.

విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు త్రాగునీటి వసతితోపాటు మరుగుదొడ్లు కిచెన్ షెడ్ ల నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు. విద్యతో పాటు మంచి భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ 7200 కోట్లను మంజూరు చేసి అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి అన్నారు. సామాన్య మధ్యతరగతి పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జాకారంలో వైటీస్ ఏర్పాటు చేసి వృత్తి కోర్సులు కూడా ప్రారంభించమన్నారు. త్వరలో మెడికల్ కళాశాల క్లాసులు కూడా ప్రారంభించుకుంటామని స్పష్టం చేశారు.

జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దూర దృష్టితో తెలంగాణలో గతంలో వివక్షత గురైన పాఠశాల భవనాలను నూతన విధానాలతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాల భవనాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతున్నారని ఇది మన అందరికీ గర్వకారణం అని ఆయన అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 125 పాఠశాలలు మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేసి సుమారు 50 కోట్ల రూపాయలు మంజూరు కాగా, ఇప్పటివరకు13 పాఠశాలలో పూర్తి చేసామని త్వరలోనే మిగతా పాఠశాలలు నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య ,
జిల్లా విద్యాశాఖ అధికారి జి పానిని, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత, జడ్పిటిసి తుమ్మల హరిబాబు, గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, గోవిందరావుపేట సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీలు, సహకార చైర్మన్లు మండల పాలక మండలి సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News