Friday, April 19, 2024

విద్యార్థినిలను వేధిస్తున్న ప్రిన్సిపాల్, అటెండర్… వారిపై చర్యలు తీసుకోండి: మంత్రి సత్యవతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో మాట్లాడి విచారణకు ఆదేశించారు.

జిల్లా ఆర్ సిఒ, అధికారుల వెంటనే ఇఎంఆర్ఎస్ కు చేరుకుని విద్యార్థినిల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, అటెండర్ లపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో నెలలో రెండుసార్లైన ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో కిచెన్ స్టోర్ రూమ్ లను పరిశీలించాలన్నారు. విద్యార్థులకు సరైన వసతులు అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News