Thursday, April 18, 2024

కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఉమ్రా విసాల జారీ తాత్కాలికంగా రద్దు

- Advertisement -
- Advertisement -

visa-suspended

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా సౌది అరేబియాలోని మక్కా, మదీనా నగరాల సందర్శనకు జరిపే ఉమ్రా యాత్ర విసాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసినట్లు గురువారం సౌది అరెబియా కౌన్సిల్ జనరల్ సాద్ జాఫీర్ అల్‌గ్రీమ్ పేరిట భారత హజ్ , ఉమ్రా టూర్ ఆర్గనైజేషన్ చైర్మన్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలల్లో కరొనా వైరస్ వ్యాప్తి మూలంగా వేలాది మంది వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మక్కాలో జరిపే ఉమ్రా యాత్ర విసాల జారీ ప్రక్రియను గురువారం నుండి తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈ లేఖలో వివరించారు. తదుపరిఉత్తర్వులు జారీ చేసే వరకు తాత్కాలిక రద్దు వర్తిస్తుందని సౌది రాయబారి స్పష్టం చేశారు.

Saudi Arabia tourist visas suspended

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News