Home తాజా వార్తలు రిలయన్స్ బోర్డులోకి అరామ్కో చైర్మన్

రిలయన్స్ బోర్డులోకి అరామ్కో చైర్మన్

Saudi aramco chairman as independent director

 

తీర్మానాన్ని ఆమోదించినట్టు ప్రకటించిన ఆర్‌ఐఎల్

న్యూఢిల్లీ : కూటమి బోర్డులో సౌదీ అరామ్కో చైర్మన్ యాసిర్ అల్ రుమయ్యన్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకునేందుకు గాను అవసరమైన మెజారిటీ కోసం తీర్మానాన్ని ఆమోదించినట్టు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ప్రకటించింది. అల్ రుమయ్యన్‌ను చేర్చుకునేందుకు అనుకూలంగా తీర్మానంలో 98 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ క్యూ2 ఫలితాలకు ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. రుమయ్యన్ 2015 సంవత్సరం నుంచి సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించేందుకు కావాల్సిన అన్ని నియంత్రణ ప్రమాణాలను రుమయ్యన్ కల్గివున్నారని సెప్టెంబర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. అయితే ఆయన నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్మెంట్ ఫండ్(కాల్‌ఎస్‌టిఆర్‌ఎస్) నిర్ణయించింది. 2020 జూన్‌లో యుఎస్ పెన్షన్ ఫండ్ భారత్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 5.3 మిలియన్ల వాటాలను కొనుగోలు చేసింది.

Saudi aramco chairman as independent director