Home తాజా వార్తలు ఐపిఒ లిస్టింగ్‌కు సౌదీ అరామ్‌కో రెడీ

ఐపిఒ లిస్టింగ్‌కు సౌదీ అరామ్‌కో రెడీ

Saudi-Aramco

సౌదీ అరెబియా: సౌదీ అరామ్‌కో ఐపిఒ లిస్టింగ్‌కు సిద్ధమైంది. ఆదివారం సంస్థ మొత్తం విలువ 1.61 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.71 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఐపిఒ విలువను 2 ట్రిలియన్ డాలర్ల లోపు లక్షంగా చేసుకున్నారు. ఐపిఒ ద్వారా -25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంఖ్య 25 బిలియన్ డాలర్లను దాటితే ఐపిఒ లిస్టింగ్ పరంగా అరాంకో చైనాకు చెందిన అలీబాబాను అధిగమిస్తుంది. సమాచారం ప్రకారం, కంపెనీ తన 1.5 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. సంస్థ 5 శాతం షేర్లను రెండు దశల్లో విక్రయించాలని యోచిస్తోంది. రెండు శాతం షేర్లు సౌదీ అరేబియా స్టాక్ మార్కెట్లో, మిగిలిన మూడు శాతం విదేశీ మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించారు. ఐపిఒ జారీ తేదీ ఇంకా నిర్ణయించలేదు.

చైనా రూ.70 వేల కోట్ల పెట్టుబడి

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక చమురును దిగుమతి చేసుకునే చైనా, సావరిన్ వెల్త్ ఫండ్, స్టేట్ ఓండ్ ఎంటర్‌ప్రైజెస్ సహాయంతో 10 బిలియన్ డాలర్ల (రూ.70 వేల కోట్లు) వాటాలను కొనుగోలు చేయవచ్చు. సౌదీ అరాంకో ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించే కంపెనీ. 2018లో కంపెనీ మొత్తం ఆదాయం 110 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంది. అంటే అరాంకో ఆదాయాలు యాపిల్, గూగుల్ మొత్తం ఆదాయాలకు సమానం.

Saudi Aramco ready for IPO listing