Wednesday, April 24, 2024

సిసోడియాకు చిత్రహింసలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాను సిబిఐ చిత్రహింసలు పెడుతోందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం విమర్శించారు. తప్పుడు అభియోగాల పత్రాలపై సంతకాలు చేయాలని ఆయనపై సిబిఐ వర్గాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయని భరద్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియా ఇప్పుడు సిబిఐ కస్టడీలో ఉన్నారు. సిసోడియా నేరం చేశారని అనడానికి కానీ అక్రమాలు జరిగాయని చెప్పడానికి కానీ ఎటువంటి ఆధారాలు లేవని, ఇప్పుడు కల్పిత అభియోగాలతో సిసోడియాను ఈ కేసులో ఇరికించడం తద్వారా ఆప్ ప్రతిష్ట దెబ్బతీయడం కేంద్రంలోని బిజెపి ఆధ్వర్యపు సిబిఐ పనితీరుగా ఉందని ఆప్ ప్రతినిధి విమర్శించారు.

ఆయనను మానసికంగా వేధిస్తున్నారని , సిబిఐ వర్గాలు అసత్యాల అభియోగాల పత్రాల కట్టను పట్టుకుని సిసోడియాను విచారిస్తున్నాయని, అభియోగాలను అంగీకరించేలా చేసేందుకు ఒత్తిడి తీసుకువస్తున్నాయని విమర్శించారు.ఇప్పుడు సిబిఐ వర్గాలు స్కామ్‌కు సంబంధించి కీలక ఫైళ్లు కన్పించకుండా పొయ్యాయని, ఫోన్లు జాడలేకుండా పొయ్యాయని చెపుతున్నారని ఇదంతా బూటకపు ప్రచారం అని ఆప్ ప్రతినిధి తెలిపారు. ఇంతకు ముందు సిబిఐ అధికారులు సిసోడియా నివాసాలు, ఆఫీసులపై సోదాలు జరిపాయి. అయితే సాక్షాధారాలు కన్పించడం లేదని కానీ, కీలక ఫైళ్లు దొరికినట్లు కానీ చెప్పలేదని , మరి ఇప్పుడు ఆయనను అరెస్టు చేసి చేయని నేరాన్ని చేసినట్లుగా చెప్పించే జబర్దస్తీకి దిగుతున్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News