Home తాజా వార్తలు బిసిసిఐ కొత్త జట్టుతో సౌరవ్ గంగూలీ…

బిసిసిఐ కొత్త జట్టుతో సౌరవ్ గంగూలీ…

ముంబై:బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బిసిసిఐ) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలి తన కొత్త జట్టు ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. తమ కొత్త జట్టు మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసిన అదే సందర్భంలో తనను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న అనురాగ్ ఠాకూర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సౌరవ్ గంగూలి ట్వీట్ చేసిన ఫోటోలో ఆయనతోపాటు అనురాగ్ ఠాకూర్, జయ్ షా, అరుణ్ ధూమల్, జయేష్ జార్జ్, మహిమ్ వర్మ ఉన్నారు.

వీరంతా బిసిసిఐ కొత్త కార్యవర్గంలో ఉండనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా బోర్డులో నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధూమల్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. జయేష్ జార్జ్ సంయుక్త కార్యదర్శిగా, మహిమ్ వర్మ ఉపాధక్షుడిగా ఉంటారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలిని ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ నెల 23న గంగూలి బిసిసిఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

Saurav Ganguli tweets the new BCCI team