Home జాతీయ వార్తలు సావర్కర్ విషయంలో రాజీపడం: శివసేన

సావర్కర్ విషయంలో రాజీపడం: శివసేన

 

ముంబయి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సావర్కర్ కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహా సంకీర్ణానికి సావర్కర్ వ్యాఖ్యల సెగ తగులుతోంది. రాహుల్‌పై శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సావర్కర్ విషయంలో తాము రాజీపడేదే లేదని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపాడు. ఆదివారం సంజయ్ మీడియాతో మాట్లాడారు. గాంధీ, నెహ్రూల్లాగే సావర్కర్ కూడా మహానేత అని పొగిడారు. స్వాతంత్రోద్యమంలోని మహానీయులను అందరూ గౌరవించాల్సిందేనని సూచించారు. పేరులో గాంధీ ఉన్నంతమాత్రాన రాహుల్ గాంధీ కాలేరని మండిపడ్డారు. రాహుల్ ఎన్ని జన్మలెత్తినా సావర్కర్ కాలేరని ఆర్‌ఎస్‌ఎస్ దుమ్మెత్తిపోసింది. భారత్ బచావో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రేప్ ఇన్ ఇండియాపై క్షమాపణలు చేప్పడానికి తాను రాహుల్ సావర్కర్ కానని రాహుల్ గాంధీని అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఎన్ సిపి మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Savarkar too laid down his life for the country: SS, Veer Savarkar was not Maharashtra’s but the country’s blessing,My name is not Rahul Savarkar but Rahul Gandhi
Savarkar too laid down his life for the country: SS