Saturday, January 28, 2023

కాలిఫోర్నియా మేయర్ పీఠంలో మన మహిళ

- Advertisement -

Savita-Vaidyanathanమొన్న అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె సవిత వైద్యనాథన్. కాలిఫోర్నియా రాష్ర్టంలోని క్యూపర్టినో పట్టణ మేయర్‌గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదివిన సవిత, శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తిచేసింది. గత 20 సంవత్సరాల నుంచి క్యూపర్టినోలో నివాసం ఉంటోంది. ఆమె తొలినాళ్లలో మ్యాథ్స్ టీచర్‌గా ఉద్యోగం చేసింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫీసర్‌గా కూడా పనిచేసింది. ఇలా రెండు విభిన్నమైన ఉద్యోగాల్ని చేసిన సవిత, స్థానికంగా నిర్వహించే వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఇదే టైంలో ప్రజల మనసులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్‌గా పోటీ చేసి 2014లో క్యూపర్టినో సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైంది. తాజాగా యూత్, ఎంటర్‌టైన్‌మెంట్, సీనియర్స్ అనే నినాదంతో మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా మేయర్ పీఠాన్నే దక్కించుకుంది. నగర మేయర్‌గా ఎన్నికైన సవిత ప్రమాణ స్వీకారాన్ని ఆమె కుమార్తె చేయించడం విశేషం. కాలిఫోర్నియాలో విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందిన చిన్న పట్టణాల జాబితాలో క్యూపర్టినోకు ప్రత్యేక స్థానం ఉంది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles