Home తాజా వార్తలు వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ‘సవ్యసాచి’..(టీజర్)

వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ‘సవ్యసాచి’..(టీజర్)

Savyasachi Teaser Released

హైదరాబాద్: చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సవ్యసాచి’. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇక సవ్యసాచి అంటే.. రెండు చేతులతోనూ అస్త్రాలను సంధించగల నేర్పరి అని అర్థం. భారతంలో అర్జునుడికి ఈ పేరుంది. అర్జనుడు తన రెండు చేతులతోనూ బాణాలను సంధించగలడు అందుకే ఆయనను సవ్యసాచి అంటారు. ఇంతటి పవర్ ఫుల్ నేమ్‌ను చందూ తన మూవీ టైటిల్‌గా వాడుకున్నారు. ఇందులో హీరో ఏ రకంగా సవ్యసాచి? అనేది తెలియాలంటే మాత్రం మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. టీజర్ లో చైతూ చెప్పిన ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ , ‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని..  ఈ సవ్యసాచిలో సగాన్ని’  అనే డైలాగ్స్ బాగున్నాయి. టీజర్‌ని చూస్తుంటే ఇది ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో సీనియర్ హీరో మాధవన్ తోపాటు భూమిక కూడా నటిస్తోంది. చైతూకు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణీ బాణీలు అందిస్తున్నారు. దీపావళి కానుకగా మూవీ విడుదల కానుందని సమాచారం.