Friday, April 19, 2024

ఎంపి సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ నోటీసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి సుజనా చౌదరికి చెందిన రూ.400కోట్లు విలువైన ఆస్తుల వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా(చెన్నై కార్పొరేట్ బ్రాంచ్) గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో మార్చి 21న ఆస్తులకు టెండర్లు దాఖలు చేయవ్చని, లేనిపక్షంలో మార్చి 23న ఆస్తులను ఆక్షన్ నిర్వహిస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నోటీసులలో పేర్కొంది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆ నోటీసుల్లో తెలిపింది. రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ వివరిస్తోంది.

సుజనా యూనివర్సల్ కంపెనీ తీసుకున్న బ్యాంక్ లోన్లకు గ్యారెంటీ సంతకాలు పెట్టిన సుజనా చౌదరి, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, వై.శివలింగ ప్రసాద్ (లేట్), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ. ఎస్‌ఇ ప్రసాద్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ సంస్థల పేర్లను బ్యాంక్ తెలిపింది. మార్చి 20న ఉదయం 11 గంటల నుంచి మ. 3 గంటల వరకు ఆస్తుల్ని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసుల్లో వెల్లడించింది. మార్చి 21న టెండర్లు దాఖలు చేయాలని కోరిన బ్యాంక్, మార్చి 23 ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ యాక్షన్ నిర్వహించనుంది. కాగా ఈ నోటీసులపై సుజనా చౌదరి స్పందించలేదన్నది సమాచారం.

SBI Bank Issued Notice to BJP MP Sujana Chowdary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News