Saturday, April 20, 2024

ఎస్‌బిఐ గృహ రుణాలు మరింత చౌక

- Advertisement -
- Advertisement -
SBI Home Loans Are Cheaper
0.25 శాతం తగ్గింపు ప్రకటించిన బ్యాంక్

న్యూఢిల్లీ : పండగ సీజన్ సందర్భం గా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా) గృహ రుణాల రేట్లను మరింత గా తగ్గించింది. దాదాపు పావు శాతం (0.25 బేసిస్ పాయింట్లు) మేరకు గృహ రుణ రేటులో తగ్గింపును ప్రకటించింది. రూ.75 లక్షలకు పైన గృహ రుణాలపై పావు శాతం తగ్గింపును ఎస్‌బిఐ ప్రకటించింది. ఎనిమిది మెట్రో నగరాల్లో రూ.3 కోట్ల వరకు గృహ రుణాలపై ఒకే విధంగా తగ్గింపు ఉంటుంది. అయితే ఇది వినియోగదారుల సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. యోనో యాప్ నుండి రుణం కోసం దరఖాస్తు చేసుకుని ఆమోదం లభిస్తే, వారికి అదనంగా 5 బేసిస్ పాయింట్లు రాయి తీ ఉంటుంది. రూ.30 లక్షల లోపు గృహ రుణాలపై తక్కువగా 6.90 శాతం రేటు, రూ.30 లక్షలకు పైన 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంతకుముందు బ్యాంక్ పండుగ సీజన్ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద గృహ రుణాలు, కార్లు, బంగారం, వ్యక్తిగత రుణాల ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం మాఫీ చేస్తామని ఎస్‌బిఐ ప్రకటించింది.

SBI Home Loans Are Cheaper

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News