పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇక్కట్ల నుంచి ఈ వ్యాలెట్లు కాస్త ఉపశమనం ఇచ్చాయి. అందరూ కాకపోయిన దాదాపు యువత చాలా మంది ఇప్పుడు ఈ వ్యాలెట్లను వినియోగిస్తున్నారు. అయితే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తాజాగా వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఖాతా నుంచి నేరుగా ఈ వ్యాలెట్ లకు నగదు బదలాయింపులను ఆపేస్తున్నట్లు ఎస్బిఐ ప్రకటించింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారానే వాటిని రీచార్జీ చేసుకోవాలని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆర్బిఐ, ఎస్బిఐని కోరింది. ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన ఆన్ లైన్ మోసాలు, సైబర్ దాడులను అరికట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎస్బిఐ ఛైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యా తెలిపారు. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, త్వరలో దీనిని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. కానీ ఎస్బిఐ బడ్డీ యాప్ కు మరింత మంది వినియోగదారులను పెంచుకొనేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యాలెట్ సంస్థలు అంటున్నాయి.
ఖాతాదారులకు మరో షాకిచ్చిన ఎస్బిఐ…!
- Advertisement -
- Advertisement -