Home జాతీయ వార్తలు ఇడి కేసులో చిదంబరానికి బెయిల్

ఇడి కేసులో చిదంబరానికి బెయిల్

Chidambaramఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా సిబిఐ కస్టడీలో ఉన్న మాజీ కేంద్రమంత్రి , కాంగ్రెస్ అగ్రనేత చిదంబరానికి ఇడి కెసులో ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఇడి నుంచి రక్షణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మంజూరు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు చిదంబరాన్ని అరెస్టు చేయవద్దని ఇడి అధికారులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా సిబిఐ తనను అరెస్టు చేయడంపై కూడా చిదంబరం కోర్టులో సవాల్ చేశారు.  ఆయన పిటిషన్ పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సిబిఐ కస్టడీ వచ్చే సోమవారం ముగియనుందని, ఈ క్రమంలోనే అదే రోజు ఆయన పిటిషన్ పై విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

SC Gives Chidambaram Interim Bail In ED Case