Home జాతీయ వార్తలు అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్

అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్

Supreme Court న్యూఢిల్లీ: అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయోధ్య మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ముగ్గురు మధ్యవర్తుల కమిటీని నియమిస్తూ శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది.  మధ్యవర్థులుగా పండిట్ రవిశంకర్, జస్టిస్ ఖలీవుల్లా, లాయర్ శ్రీరాం పంచ్‌లు సభ్యులుగా నియమించింది. ఈ సందర్భంగా ఈ ముగ్గురు సభ్యుల ప్యానెల్ నాలుగు వారాల్లోగా తన నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియను గోప్యంగా ఉంచాలని, ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా, రెండు రోజుల క్రితం ఈ విషయమై కోర్టులో వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వ ప్రక్రియను హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించగా, ముస్లిం సంఘాలు మాత్రం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాయి. బుధవారం ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత  తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది. ఇవాళ సుప్రీంకోర్టు అయోధ్య మధ్యవర్తిత్వంపై తీర్పును వెల్లడించింది.

SC Orders Confidential Mediation in Ayodhya Land Dispute