Home జాతీయ వార్తలు మీరు పని చేసిన రాష్ట్ర పోలీసులపైనే నమ్మకం లేదంటే ఎలా..?

మీరు పని చేసిన రాష్ట్ర పోలీసులపైనే నమ్మకం లేదంటే ఎలా..?

SC rejects ex-mumbai police chief plea to transfer cases

 

ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: తన కేసు దర్యాప్తును స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేయాలంటూ పిటిషన్ వేసిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్‌కు సంబంధించిన కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో 30 ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన అధికారికి తమ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదనడం విడ్డూరమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అద్దాలమేడలో ఉన్న వ్యక్తి ఇతరులపై రాళ్లు విసర కూడదన్న సామెతను ధర్మాసనం గుర్తు చేసింది. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకొని మరోవిధంగా కోర్టును ఆశ్రయిస్తామని సింగ్ తరఫు న్యాయవాది మహేశ్‌జెఠ్మలానీ ధర్మాసనానికి విన్నవించడంతో విచారణను ముగించారు. సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 17న పోలీస్ కమిషనర్ పదవి నుంచి తొలగించి హోంగార్డ్ విభాగం జనరల్ కమాండర్‌గా బదిలీ చేసింది. ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్‌సిపి నేత అనిల్‌దేశ్‌ముఖ్‌పై సింగ్ అవినీతి ఆరోపణలు చేశారు. దాంతో, మహారాష్ట్ర ప్రభుత్వం ఆయణ్ని వేరేశాఖకు బదిలీ చేసిందని భావిస్తున్నారు.